OTTలో బ్లైండ్ మ్యాన్ విన్యాసాలతో హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ - ఒక్కో సీన్‌కు ఊపిరి బిగపట్టాల్సిందే!
ఓటీటీల్లో ఒక్కో జానర్లో వందల కొద్ది సినిమా సిరీస్‌లు వస్తుంటాయి. కానీ అన్నీ చూడటం కష్టమే. అందుకే అందులో దొరికే ది బెస్ట్ చిత్రాలను చూడాలని అనుకుంటారు మూవీ లవర్స్. అలాంటి వారికోసం ఓ సూపర్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ఓటీటీలోకి దిగింది. ఇందులో ఒక్కో సీన్ మీ ఊపిరిని బిగపట్టేలా చేస్తుందనే చెప్పాలి! ఇప్పుడీ సినిమా ఓటీటీలో తెలుగు వెర్షన్లోనే అందుబాటులో ఉంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఎందులో ఉందో? తెలుసుకుందాం.
స్టీఫెన్ లంగ్ చాలా మంది తెలుగు సినీ ప్రియులకు తెలిసే ఉంటాడు. అవతార్ సినిమాలో కమాండర్‌గా నటించి మెప్పించాడు. అతడు నటించిన మరో చిత్రం డోంట్ బ్రీత్. ఈ సినిమా మస్త్‌గా ఉంది. ఇందులో అతడు బ్లైండ్ మ్యాన్‌గా అదిరిపోయే నటన చేసి అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

చూపులేని వ్యక్తిగా అతడి నటన, పోరాటం మాములుగా లేదు. ఒక్కో సీన్ ఊపిరి బిగపట్టి చూసేలా చేస్తుంది. యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. కంటి చూపు లేని వ్యక్తికి ఎంత సామర్థ్యం ఉంటుంది? అసలు అతడు ఏం చేయగలడు అనే వాటిని అద్భుతంగా చూపించారు. ముగ్గురు చూపు ఉన్న వ్యక్తులను చూపులేని, ముసలివాడైన అతడు అల్లాడించేస్తాడు. ఒక్కొక్కరిని ముప్పతిప్పలు పెట్టించేస్తాడు.
వాస్తవానికి ఈ డోంట్ బ్రీత్ చిత్రం 2016లో రిలీజైంది. ప్రస్తుతం తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా తెలుగులో. దీనికి కొనసాగింపుగా 2021లో రెండో భాగం కూడా వచ్చింది. ఇది నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా, ఈ డోంట్ బ్రీత్ మొదటి భాగం నిడివి కేవలం గంటన్నార మాత్రమే ఉంటుంది. ఒక రోజు రాత్రి జరిగిన సంఘటన ఆధారంగానే కథ మొత్తం సాగుతుంది. సినిమా మొత్తం తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పించేలా ఉంది.
ఇంతకీ కథ ఏంటంటే? : అలెక్స్, రాకీ, మనీ అనే ముగ్గురు వ్యక్తులు దొంగతనాలు చేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు.అయితే ఓ భారీ దొంగతనం చేసి లైఫ్ టైమ్ సెట్ అయిపోవాలని ఆశపడతారు. వారికి గల్ఫ్ వార్ వెటరన్ నార్మన్ నార్డ్ స్టార్మ్ దగ్గర భారీ మొత్తంలో డబ్బులు ఉన్నట్లు తెలుస్తుంది. అతడి దగ్గర దాదాపు 3 లక్షల డాలర్లు ఉన్నట్లు సమాచారం తెలుసుకుంటారు. దీంతో అతడిని టార్గెట్ చేస్తారు.
పైగా అందులోనూ నార్మన్కు చూపు కనపడదు. దీంతో వారు తమ పని మరింత సులభం అవుతుందని అనుకుంటారు. కానీ, ఇంట్లోకి వెళ్లాక వారి ఆలోచన తప్పని తెలుస్తుంది. తన ఇంట్లోకి చొరబడిన ఆ ముగ్గురిలో ఒకరిని నార్మన్ కాల్చి చంపేస్తాడు. దీంతో మిగిలిన ఇద్దరూ ఇంట్లో ఇరుక్కుపోతారు. మరి వాళ్లు అక్కడి నుంచి తప్పించుకున్నారా? అసలు చివరికి ప్రాణాలు కాపాడుకున్నారా? అనేదే మిగతా కథ. మరి మీరు ఈ చిత్రం చూడకపోయి ఉంటే ఎంచక్కా చూసేయండి.


Click it and Unblock the Notifications











