OTTలోకి వచ్చేసిన సరికొత్త విజువల్ వండర్ మూవీ.. కళ్లు చెదిరేలా రాక్షసి డ్రాగన్‌తో యువరాణి పోరాటం!
మూవీ లవర్స్‌ను అలరించేందుకు ఓటీటీలోకి మరో కొత్త యాక్షన్ ఫాంటసీ ఫిల్మ్ వచ్చేసింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి ఓ రిఫరెన్స్‌తో అదిరిపోయే చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఇది చూసిన ప్రేక్షకులు సినిమాలోని టేకింగ్, యాక్షన్ సీన్స్, హీరోయిన్ చేసే కళ్లు చెదిరే సాహసాలకు ఫిదా అవుతున్నారు. మరి ఇంతకీ ఆ చిత్రం ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది? దాని పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం...
వరల్డ్ సినీ ఇండస్ట్రీలో కొన్ని వేల సినిమా సిరీస్‌లు అందుబాటులోకి వస్తుంటాయి. అందులో యాక్షన్ చిత్రాలకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్స్ అంటే టీవీలకు అతుక్కుపోతుంటారు. ఎందుకుంటే అందులో ఉండే ఒక్కో సీన్ మరో ప్రపంచంలోకి తీసుకెళ్తూ ఆ రేంజ్లో గూస్ బంప్స్ తెప్పిస్తాయి మరీ. ఇప్పుడు అలాంటి సినిమానే ఓటీటీలోకి ఒకటి వచ్చింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ తరహా లాంటి ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ రేంజ్లో నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ ఆకట్టుకుంటోంది.

అదే డామ్ సెల్. ఈ యాక్షన్ సినిమాలో రాజ్యాలు, రాజులు, గుర్రాలు, తోడేళ్లు, డ్రాగన్స్ వంటి పాత్రలు చేసే సాహసాలు ఒక్కో సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇందులో జీవోటీ రిఫరెన్సులు కూడా కనిపిస్తున్నాయి. 2022లో వచ్చిన ది ప్రిన్సెస్ మూవీ కూడా గుర్తొస్తోంది. ఇదంతా అనిపిస్తున్నప్పటికీ కథ చాలా కొత్తగానే ఉంటుంది. ఫాంటసీ లవర్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది.
ఈ సినిమా కథేంటంటే.. మూవీలో ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో యువ రాణిగా హీరోయిన్ఎలోడీ(మిల్లీ బాబీ బ్రౌన్) ఎంతో విలాసవంతమైన, సంతోషమైన జీవితం గడుపుతూ ఉంటోంది. అయితే పెళ్లి పేరుతో మరో రాజ్యానికి చెందిన వాళ్లు వచ్చి మంచి వాళ్లలా నటిస్తూ యువరాణిని పెళ్లాడి తమ రాజ్యానికి తీసుకెళ్తారు. అయితే వాళ్లు తీసుకెళ్లింది వారి ఆచారం ప్రకారం ఆమెను డ్రాగన్‌కు బలి ఇవ్వడానికి అని తెలుస్తుంది.

కానీ వారి కుట్ర తెలియని హీరోయిన్ ప్రిన్స్ ఎలోడీ(మిల్లీ బాబీ బ్రౌన్) మాత్రం ఎన్నో ఆశలతో అత్తగారింటికి వెళ్తుంది. అయితే ఆమె వెళ్లిన కాసేపటికే ఒక పూజ చేసి వారి కోటలో ఉన్న పెద్ద సొరంగంలో తనను పడేస్తారు. దీంతో ఆమె అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. ఇక లేచి చూసేసరికి తాను ఎక్కడో ఉందో కూడా తెలీదు. ఎదురుగా మాత్రం ఒక పెద్ద రాక్షసి డ్రాగన్ ఉంటుంది. అది నోటి నుంచి నిప్పులు కక్కుతూ మహారాణిని చంపేందుకు చూస్తూ ఉంటుంది.
మరి ఆ డ్రాగన్ దగ్గరి ప్రిన్సెస్ ఎలా తప్పించుకుంది? తనకు జరిగిన అన్యాయాన్ని మరో అమ్మాయికి జరగకుండా ఆపిందా? అసలు చివరికి తన ప్రాణాలను ఎలా కాపాడుకుంది? అన్నదే ఈ కథ సారాంశం. ఆద్యంతం ఈ చిత్రం విజువల్ వండర్‌తో హీరోయిన్ చేసే సాహాసాలు, పోరాటంతో సాగుతుంది. విమర్శకుల నుంచి కూడా ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కింది. మరి ఈ డామ్ సెల్ చిత్రాన్ని మీరు చూడాలి అనుకుంటే ఈ వీకెండ్‌తో చూస్తూ థ్రిల్ పొందండి.


Click it and Unblock the Notifications











