Kantara OTT విడుదలపై నిర్మాత క్లారిటీ.. అందులో నిజం లేదని షాకింగ్ రియాక్షన్!

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న కాంతార సినిమా కన్నడ సినిమా స్థాయిని మరో లెవెల్ కు పెంచింది. హోంబెల్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన ఈ సినిమా కన్నడలో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలయ్యింది. ఇక సినిమా విడుదల అనంతరం బాక్సాఫీస్ వద్ద బీభత్సం క్రియేట్ చేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా రిషబ్ శెట్టి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. స్వీయ దర్శకత్వంలో అతని మేకింగ్ విధానం అలాగే నటన కూడా మరో లెవెల్ లో క్లిక్కయ్యింది.

ఇక కాంతార సినిమా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేశారు. మొదట కొన్ని లిమిటెడ్ థియేటర్స్ లోనే విడుదల చేసిన అల్లు అరవింద్ ఆ తరువాత జనాల ఆదరణను బట్టి థియేటర్స్ సంఖ్యను పెంచారు. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కోసం ఆయన 2 కోట్ల పెట్టుబడి పెట్టగా ఇప్పుడు 15 కోట్ల షేర్ కు చేరుకుంది. ఇక ఈ సినిమాను ఓటీటీ లో చూడాలని కూడా చాలామంది ఆడియెన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Hombale Films producer clarification on Kantara movie ott release date

నవంబర్ మొదటి వారంలోనే ఈ సినిమా ఓటీటీ లో రావచ్చని కూడా సోషల్ మీడియాలో ఒక టాక్ అయితే వచ్చింది. ఇక సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఇక ఈ సినిమా ఓటీటీ విడుదల విషయంలో వస్తున్న వార్తలపై నిర్మాత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. ఓటీటీ విడుదలపై వస్తున్న కథనాలతో ఎలాంటి నిజం లేదని ఇప్పుడే సినిమా ఓటీటీ లో వచ్చే అవకాశం లేదని అధికారికంగా క్లారిటీ ఇచ్చే వరకు ఈ రూమర్స్ ను నమ్మవద్దని హోంబెల్ ఫిలిమ్స్ లో ఒకరైన కార్తిక్ గౌడ వివరణ ఇచ్చారు.

దీంతో ఈ విషయంలో ఆడియెన్స్ కు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక కాంతార సినిమా హిందీలో కూడా మంచి కలెక్షన్స్ అందుకుంది. ఇక మొత్తంగా 190 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు అందుకున్న ఈ సినిమా 200 కోట్లకు అతి దగ్గరలో ఉంది. అదే విధంగా కన్నడ లోనే అత్యదిక మంది జనాలు చూసిన సినిమాగా కాంతార రికార్డును క్రియేట్ చేసింది. ఇక త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ తీయనున్నట్లు దర్శకుడు హీరో రిషబ్ శెట్టి క్లారిటీ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X