OTTలోకి రాబోతున్న మరో ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్.. క్షణక్షణం వణుకుతూ అక్కడ చూసేయండి!

ఈ మధ్య కాలంలో అనేక అద్భుతమైన హర్రర్, థ్రిల్లర్ చిత్రాలు ఓటీటీ వేధికగా వస్తున్నాయి. ఒకప్పుడు కామెడీతో పాటు డ్రామాలు ఎక్కువగా చూసేవారు జనాలు. కానీ ఇప్పుడు మాత్రం.. థ్రిల్లర్ చిత్రాలపై ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ విషయం అర్థం చేసుకున్న దర్శక, నిర్మాతలు కూడా అలాంటి చిత్రాలనే తీసుకు వస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇటీవలే వచ్చిన ఓ సూపర్ ఎగ్జైటింగ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

హనీ రాజ్ ప్రధాన పాత్రలో ఇటీవలే మలయాళం ఓ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం వచ్చింది. అదే రాణి: ది రియల్ స్టోరీ. ఈ సినిమాలో హీన్ రోజ్ తో పాటు నియతి కాదంబి, అశ్విన్ గోపీనాథ్, భావన, ఊర్వశి, పార్వతి మాలా, అనుమోల్, గురు సోమసుందరం, అశ్వత్ లాల్, మణియంపిల్ల రాజు, ఇంద్రన్స్, కృష్ణన్ బాలకృష్ణన్ , అంబి కృష్ణన్, నీనాసం, రాము మంగళపల్లి, అతిర శ్రీకుమార్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.

Honey Rose Recent Investigative Mystery Thriller Movie Rani The Real Story OTT Streaming Details Here

ఈ అద్భుతమైన ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ కు శంకర్ రామృష్ణన్ దర్శకత్వం వహించారు. అలాగే మ్యాజిక్‌టైల్ వర్క్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వినోద్ మీనన్ మరియు శంకర్ రామకృష్ణన్ లు రాణి: ది రియల్ స్టోరీ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. అదిరిపోయే కథతో వచ్చిన ఈ సినిమాను 2023 సెప్టెంబర్ 21వ తేదీన థియేటర్లలో విడుదల చేశారు. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో నటీనటులు అంతా బాగానే మెప్పించారు. అయితే కేవలం మలయాళంలో మాత్రమే ఈ సినిమా విడుల అయింది.

తాజాగా ఈ చిత్రాన్ని ఓటీటీ వేధికగా విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. ముఖ్యంగా ప్రముఖ ఓటీటీ సంస్ధ అయిన మనోరమా మాక్స్ వేధికగా ఈ చిత్రాన్ని మార్చి 7వ తేదీ నుంచి అంటే ఈరోజు నుంచే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మలయాళం మాత్రమే విడుదల అయిన ఈ సినిమా ఓటీటీలో కూడా ఈ ఒక్క బాషలోనే అందుబాటులోకి రాబోతుంది. ఇప్పటికి అయితే ఈ సినిమాను మిగతా భాషల్లో విడుదల చేయడం లేదు.

మరి ఓటీటీ వేధికగా ఈ సినిమా టీఆర్పీని పెంచి సెన్సేషన్ క్రియేట్ చేస్తే.. ఇతర భాషల్లో కూడా తీసుకు వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి మూవీం టీం ఇతర భాషల్లో తీసుకు వస్తారా లేదా అనేది. మీకు గనుక థ్రిల్లర్ చిత్రాలు చూడాలని ఆశగా ఉంటే.. సబ్ టైటిల్స్ పెట్టుకుని ఈ సినిమానూ చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X