OTTలోకి వచ్చేసిన తెలుగు హారర్ కామెడీ మూవీ... ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి ప్రతివారం కొత్త కంటెంట్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అయితే అందులో ఓ హారర్ కామెడీ చిత్రం కూడా రిలీజ్ అయి ఆకట్టుకుంటుంది. రొటిన్ చిత్రాల కంటే.. డిఫరెంటు జోనర్ చిత్రాలకు ప్రేక్షకులకు పట్టం కడుతున్నారు. ఇక ఆ నేపథ్యంలోనే మేకర్స్ కొత్త జోనర్లలో మూవీస్ తెరకెక్కిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్టుగా నిలిచిన డీడీ రిటర్స్న్ ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ వివరాల్లోకి వెళితే....
ఈ మధ్య కాలంలో ఓటీటీలో ఢిపరెంటు మూవీస్ కు ఆదరణ ఎక్కువగా లభిస్తుంది. స్టార్ హీరోలు లేకపోయినా... నటీనటులు తెలియకపోయినా... కంటెంట్ బాగుంటే ఆదరిస్తారు. అలా ఓ తమిళ సినిమా తెలుగు వర్షన్ ఓటీటీకి వచ్చి స్ట్రీమింగ్ అవుతుంది. తమిళంలో హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన డీడీ రిటర్న్స్ ఇప్పుడు తెలుగులో అందుబాటులోకి వచ్చింది.

హారర్ కామెడి ఎంటర్ టైనర్ అంటే ఈ మధ్య కాలంలో మంచి క్రేజ్ దక్కుతోంది. హారర్ కామెడీ సినిమాలు ఎప్పుడు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తాయి. ఇప్పటికే ఈ జోనర్ లో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అలాగే ఇతర భాషల్లో వచ్చిన సినిమాలు కూడా తెలుగులో డబ్ అయ్యి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాయి.
ఇక ఇటీవల తరహా కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది డీడీ రిటర్న్స్. భూతాల బంగ్లా అనేది శీర్షిక. కమెడియన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంతానం ఈ సినిమాలో హీరోగా నటించాడు. తమిళనాట సంతానం కమెడియన్ గా చాలా సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇక డీ డీ రిటర్న్స్ సినిమా తమిళ్ లో ముందుగా రిలీజ్ చేయగా... అక్కడ సూపర్ హిట్టుగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులోకి రిలీజ్ చేశారు మేకర్స్.
డీడీ రిటర్న్స్ తెలుగు వర్షన్ ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ సినిమా డిటిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 భారీ ధరకు విక్రయించింది. అయితే ఇప్పుడు ఈ మూవీ తెలుగు వర్షన్ ను జీ 5 లో స్ట్రీమింగ్ చేస్తోంది. ఓటీటీలో ఈ సినిమాకు మంచి ఆదరణ వస్తోంది. భయపెట్టే సన్నివేశాలతో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీతో ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది.
డీ డీ రిటర్న్స సినిమా విషయానికి వస్తే.... ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. దిల్లుకు దుడ్డు ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన మూడో సినిమా ఇది. ఇక ఈ సినిమాలో సంతానం కు జోడీగా బబ్లీ బ్యూటీ సురభి హీరోయిన్ గా చేసింది. ఇక ఈ సినిమాలో ప్రదీప్ రావత్ , రెడిన్ కింగ్స్లీ లాంటి వారు కీలక పాత్రల్లో నటించారు. ఆర్‌కె ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ సినిమాకు ఆఫ్‌రో మ్యూజిక్ అందించారు. మీరు గనుక హర్రర్ కామెడీ సినిమాను ఇష్టపడితే... భయంతో పాటు నవ్వులు పంచే... ఈ సినిమాను ఇప్పుడే జీ 5 ఓటీటీలో చూసేయండి..


Click it and Unblock the Notifications











