OTTలోకి వెన్నులో వణుకు పుట్టించే సూపర్ ఏలియన్ థ్రిల్లర్.. ట్రైలర్ చూస్తుంటేనే గుండెలో దడ!

ఓటీటీలోకి మరో కొత్త లైవ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ రాబోతుంది. కొరియన్ సిరీసులంటే చాలా మందికి మక్కువే. ఇక అమ్మాయిలు ఎక్కువగా కొరియన్ సిరీసులు చూస్తుంటారనే విషయం తెలిసిందే. వాటికి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటారు. అయితే తాజాగా ఓటీటీలోకి పారసైట్ ది గ్రే అనే వెబ్ సిరీస్ ఓటీటీలీకి రాబోతుంది. ఈ సిరిస్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. అసలు దీని కథేంటి.. ఈ సిరీస్ ఓటీటీ డీటెయిల్స్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సూపర్ థ్రిల్లర్ సిరీస్
ఈ మధ్య కాలంలో ఓటీటీలో విడుదల అయ్యే ప్రతి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్న సంగతి తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే చాలు వాటికి బ్రహ్మరథం పట్టేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎన్నో సస్పెన్స్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టీరీస్, సూపర్ న్యాచురల్ డ్రామాస్, హర్రర్ మూవీస్ ఓటీటీలోకి వచ్చి సందడి చేశాయి. అయితే ఇప్పుడు మరో కొత్త సూపర్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలోకి రాబోతుంది. మునుపెన్నడూ చూడని విధంగా ఈ సిరీస్ తెరకెక్కినట్లు తెలుస్తోంది.

Horror Parasyte The Grey Korean Series Streaming on Netflix OTT From April 5th Full Details Here

కొరియన్ సీరిసులకు క్రేజ్
జపనీస్ ఫిక్షన్ ఆధారంగా తెరకెక్కిన సిరీస్ పారసైట్ ది గ్రే. ఈ సిరీస్ కొరియన్ ప్రొడక్షన్ హౌస్ రూపొందించింది. లైవ్ యాక్షన్ సిరీస్ గా పేరొందుతున్న ఈ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ప్రేక్షకులకు తెలియని ఎన్నో సరికొత్త ఎలెమెంట్స్ ఈ ట్రైలర్ లో దాగి ఉన్నాయని చూస్తే తెలుస్తోంది. 'హెల్ బౌండ్' , 'ట్రైన్ టు బుసాన్' అనే పాపులర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన యోన్ సాంగ్ హో ఈ సిరీసును డైరెక్ట్ చేశాడు.

ట్రైలర్ చూస్తేనే గుండెల్లో దడ
పారసైట్ ది గ్రే సిరీసులో జియోన్ సోని ప్రధాన పాత్రలో నటించాడు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి ఆదరణ వచ్చింది. ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. భూమిపై తమ ఆధిపత్యాన్ని చలాయించడానికి ఏలియన్ పారసైట్స్ ప్రయత్నిస్తుంటాయి. మనుషులను తమ కంట్రోల్ లోకి తీసుకువచ్చేందుకు.. కొంత మంది వ్యక్తలను ఏలియన్స్ ఆధీనంలోకి తీసుకుని అల్లకల్లోలం సృష్టిస్తాయి. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే మాత్రం కచ్చితంగా గుండెల్లో దడ పుట్టేస్తోంది.

యువతి చేసిన పోరాటం
ఏలియన్ కలిసి బ్రతకడానికి ఓ యువతి చేసిన పోరాటమే పారసైట్ ది గ్రే సిరీస్ కథ. ఇక ఈ సిరీస్ ఏప్రిల్ 5 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇంగ్లీషుతో పాటు పలు భాషల్లో అందుబాటులోకి రానుంది. తెలుగులో కూడా ప్రసారం కానుందని తెలుస్తోంది. ఇక చాలామంది కొరియన్ సిరీస్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మరి కొరియన్ సిరీస్ లను ఇష్టపడే వారికీ పారసైట్:ది గ్రే సిరీస్ మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

మరి ట్రైలర్ తోనే భయం పుట్టిన ఈ సిరీసు.. ఓటీటీలో ఏ రేంజులో ఆకట్టుకుంటుందో చూడాలి. మీరు కనుగ ఈ సిరీస్ ట్రైలర్ చూడకపోయి ఉంటే ఇప్పుడే చూసేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X