Parampara Season 2 Trailer: మరోసారి థ్రిల్ ఇచ్చే డ్రామాతో రాబోతున్న వెబ్ సీరీస్.. న్యూ ట్విస్ట్!

ఇటీవల కాలంలో వెబ్ సీరీస్ లకు ఏ స్థాయిలో రెస్పాన్స్ అందుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీలైనంత వరకు డిఫరెంట్ సీరియస్ డ్రామాలతో ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నారు. ఓటీటీ లో ఎంత కొత్తగా ఉంటే అంత ఎక్కువగా జనాలు ఎట్రాక్ట్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ అయితే పరంపర సీజన్ 2 పైనే ఉంది. గతంలో వచ్చిన ఫస్ట్ సీజన్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు సెకండ్ సీజన్ ను మరింత విభిన్నంగా ప్రేక్షకుల ముందుకి తీసుకు రాబోతున్నారు.

ఇక పరంపర సీజన్ 2 ట్రైలర్ విషయానికి వస్తే.. జగపతిబాబు, శరత్ కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో రూపొందించిన ఈ వెబ్ సీరిస్ లో ఈసారి రాజకీయ ఎత్తుగడలు మరీంత ఉత్కంఠగా మారబోతున్నట్లు తెలుస్తోంది. నవీన్ చంద్ర vs శరత్ కుమార్ అలాగే జగపతిబాబు మధ్యలో ఒక సీరియస్ డ్రామా నడవబోతోంది. తప్పకుండా ఈసారి ఉహించని థ్రిల్లింగ్ అంశాలు ఉంటాయని ట్రైలర్ ద్వారా క్లారిటీ వచ్చేసింది.

Hotstar Disney plus new web series Parampara Season 2 Trailer

మా నాన్న నుంచి లాగేసుకున్న అధికారం పోగొట్టుకున్న పేరు కోల్పోయిన జీవితం అన్ని తిరిగి రావాలి అని నవీన్ చంద్ర ఇంట్రడక్షన్ తోనే కథ ఎలా సాగనుందో ఒక క్లారిటీ వచ్చేసింది. మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ నుంచి ఒక యువకుడు తనకు రావాల్సిన దాన్ని ఎలా లాక్కుని పైకి ఎదిగాడు వారికి జరిగిన గొడవ ఏమిటి అనే అంశాలు ఇందులో హైలెట్ కాబోతున్నాయి. ఇక ఈ వెబ్ సీరీస్ కు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది.

హరి ఎల్లేటి రచనలో కృష్ణ విజయ్, విశ్వనాథ్, హరి డైరెక్షన్ లో నిర్మించిన ఈ వెబ్ సీరీస్ పై మొదటి నుంచి అంచనాలు గట్టిగానే ఉన్నాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్పెషల్ గా రూపొందిన ఈ వెబ్ సీరీస్ కూడా తప్పకుండా సక్సెస్ అవుతుందని అనిపిస్తోంది. ఇక జూలై 21 నుంచి ఈ వెబ్ సీరీస్ స్ట్రీమింగ్ కానుంది. సోషల్ మీడియాలో కూడా విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ అయితే వస్తోంది. చాలామంది ప్రేక్షకులు ఈ వెబ్ సీరీస్ కోసం ఎదురుచూస్తున్నారు. మరి ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X