ప్రేమలు ఓటీటీపై బిగ్ ట్విస్ట్.. తెలుగులో స్ట్రీమింగ్ లేదంటూ ప్రకటన

సాధారణంగా ప్రతి భాషలోనూ ఎన్నో రకాల సినిమాలు వస్తుంటాయి. వాటిలో కొన్ని మాత్రం తక్కువ బజ్, బడ్జెట్‌తో వచ్చినా సెన్సేషనల్ హిట్లుగా నిలుస్తుంటాయి. అలాంటి చిత్రాల్లో 'ప్రేమలు' ఒకటి. కామెడీతో కూడిన లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాకు మలయాళంలో రూపొందింది. అక్కడ ఈ చిత్రం భారీ రెస్పాన్స్‌ను అందుకుని సంచలన విజయాన్ని అందుకుంది.

నస్లెన్ కే గఫూర్, మమితా బైజు ప్రధాన పాత్రల్లో గిరీష్ ఏడీ రూపొందించిన చిత్రమే 'ప్రేమలు'. ఈ మూవీ మలయాళంలో భారీ విజయాన్ని అందుకోవడంతో దర్శకధీరుడు రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ దీన్ని తెలుగులో విడుదల చేశాడు. ఇక్కడ కూడా ఈ చిత్రం భారీ వసూళ్లతో సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత తమిళంలోనూ దీన్ని రిలీజ్ చేసుకున్నారు.

Hotstar Gives Big Twist on Premalu Movie Telugu Version Digital Streaming

విడుదలైన అన్ని భాషల్లోనూ భారీ సక్సెస్‌ను సొంతం చేసుకున్న 'ప్రేమలు' మూవీ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. దీంతో దీన్ని ఓటీటీలో చూసేందుకు సినీ ప్రియులు అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మార్చి 29నే స్ట్రీమింగ్ కావాల్సిన ఈ చిత్రం.. అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. దీంతో దీని కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు.

లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ప్రేమలు' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ అదిరిపోయే ధరకు దక్కించుకుంది. అన్ని భాషల్లోనూ థియేట్రికల్ రన్‌ను దాదాపుగా పూర్తి చేసుకోవడంతో తాజాగా సదరు సంస్థ ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను అనౌన్స్ చేసింది. అందరూ అనుకున్నట్లుగానే ఈ చిత్రాన్ని ఏప్రిల్ 12 నుంచి తీసుకు రాబోతుంది.

Hotstar Gives Big Twist on Premalu Movie Telugu Version Digital Streaming

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ తాజాగా 'ప్రేమలు' మూవీని ఏప్రిల్ 12వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు ప్రకటించింది. అయితే, అసలు ట్విస్ట్ అక్కడే ఇచ్చింది. ఈ చిత్రాన్ని కేవలం మలయాళం, తమిళం, హిందీ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు హాట్‌స్టార్ తెలిపింది. దీంతో తెలుగు ప్రేక్షకులకు బిగ్ షాక్ తగిలింది. మరి ఇది వేరే ఏదైనా ఓటీటీలో వస్తుందా అన్నది చూడాలి.

ఇదిలా ఉండగా.. ఫన్ అండ్ లవ్ స్టోరీతో రూపొందిన 'ప్రేమలు' మూవీని భావన స్టూడియోస్ బ్యానర్‌పై ఫహాద్ ఫాజిల్ (పుష్ప విలన్), దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్‌లు నిర్మించారు. విష్ణు విజయ్ దీనికి సంగీతం ఇచ్చారు. ఈ చిత్రంలో అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్‌తో పాటు శ్యామ్ మోహన్, సంగీత్ ప్రతాప్, మాథ్యూ థామస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X