House of the Dragon Season 3: తెలుగులోనూ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
హౌస్ ఆఫ్ ది డ్రాగన్ (HOTD) సీజన్ 3 ఎట్టకేలకు ఇండియాలో కూడా స్ట్రీమింగ్ కాబోతుంది. జూన్ 22 నుంచి ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.సీజన్ లోని మొదటి ఎపిసోడ్‌ను ఉదయం 6:30 గంటల నుంచే జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. టార్గెరియన్ల మధ్య సాగే భీకరమైన అంతర్యుద్ధం ఈ సీజన్‌తో మళ్లీ తెరపైకి రావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఇంటెన్స్ పొలిటికల్ డ్రామా కోసం ఇండియన్ ఆడియన్స్ గత కొన్నేళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
డ్రాగన్ల గర్జనలు, వారసత్వ పోరుతో ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్‌పై భారీ క్రేజ్ నెలకొంది. అయితే, గత సీజన్లతో పోలిస్తే ఈసారి భారతీయ అభిమానులకు ఓ స్పెషల్ అప్‌డేట్ ఉంది. ఈ సీజన్‌ను ప్రాంతీయ భాషల్లో కూడా వీక్షించే వెసులుబాటు కల్పించారు. దీనివల్ల కథలోని లోతైన సంభాషణలు, ఆ సంక్లిష్టమైన ఫ్యామిలీ ట్రీని ఎక్కడా మిస్ అవ్వకుండా సులభంగా అర్థం చేసుకోవచ్చు.

వీక్లీ షెడ్యూల్.. జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
గ్లోబల్ బ్రాడ్‌కాస్ట్ షెడ్యూల్ ప్రకారం.. ప్రతి సోమవారం ఉదయం కొత్త ఎపిసోడ్లు విడుదలవుతాయి. మొదటి ఎపిసోడ్ దాదాపు 65 నిమిషాలు ఉంటుందట. ఈ భారీ ఫాంటసీ ఫ్రాంచైజీ నుంచి ఆశించే రేంజ్‌లోనే ఎపిసోడ్ లెంగ్త్ కూడా ఉంది. మీకు నచ్చిన భాషలో చూడాలనుకుంటే, ప్లేబ్యాక్ సమయంలో ఆడియో సెట్టింగ్స్‌లోకి వెళ్లి మార్చుకోవచ్చు. రాబోయే వారాల్లో ఈ సీజన్ మీ స్ట్రీమింగ్ చార్టుల్లో టాప్‌లో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
తెలుగు, తమిళ వెర్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి..
సౌత్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని, మొదటి ఎపిసోడ్ నుంచే తెలుగు, తమిళ డబ్బింగ్ వెర్షన్లను జియో హాట్‌స్టార్ అందుబాటులోకి తెచ్చింది. ఇది నిజంగా మన ప్రేక్షకులకు శుభవార్తే అని చెప్పాలి. ఒరిజినల్ వాయిస్ వినాలనుకునే వారి కోసం ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ కూడా ఉన్నాయి. ఈ హై-ప్రయారిటీ రిలీజ్‌తో ఇండియా టాప్-10 చార్టుల్లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవాలని ప్లాట్‌ఫామ్ భావిస్తోంది. లోకల్ లాంగ్వేజ్ సపోర్ట్ ఉండటంతో ఈ ఎపిక్ స్టోరీ ఇండియన్ ఆడియన్స్ కు మరింత చేరువ కానుంది.
ఏజ్ రేటింగ్..
అయితే.. ఈ సిరీస్‌కు 18+ ఏజ్ రేటింగ్ ఉంది, కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలి. ఇందులో సిరీస్ లో హింసాత్మక సంఘటనలు, రక్తపాతం, అడల్ట్ సీన్లు ఎక్కువగా ఉంటాయి. కొత్తగా చూసేవారి కోసం చెప్పాలంటే.. ఇది లెజెండరీ 'హౌస్ టార్గెరియన్' వంశం ఎలా పతనమైందనే కథతో సాగుతుంది. ఇది పాపులర్ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'కు ప్రీక్వెల్.
| ఎపిసోడ్ నంబర్ | విడుదల తేదీ (IST) | నిడివి |
|---|---|---|
| ఎపిసోడ్ 1 | జూన్ 22, 2026 | 65 నిమిషాలు |
| ఎపిసోడ్ 2 | జూన్ 29, 2026 | 62 నిమిషాలు |
| ఎపిసోడ్ 3 | జూలై 06, 2026 | 60 నిమిషాలు |
మోస్ట్ అవైటెడ్ సిరీస్ నుంచి ప్రతి సోమవారం ఉదయం ఓ కొత్త ఎపిసోడ్ అందుబాటులోకి రాబోతుంది. సోషల్ మీడియాలో స్పాయిలర్స్ రాకముందే చూడాలనుకుంటే, ఈ సిరీస్ చూడటానికి సిద్దంగా ఉండండి. ఇప్పటివరకు చూడని అతిపెద్ద డ్రాగన్ యుద్ధాలు ఈ సీజన్‌లో ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. అలాగే.. లోకల్ లాంగ్వేజ్ స్ట్రీమింగ్ కాబోతుందటం ఈ సీజన్ ప్రత్యేకత. అయితే.. ఆ సారి రక్తపాతం.. డ్రాగన్ల యుద్ధం ఎలా ఉంటుందో చూసేయండి మరి.


Click it and Unblock the Notifications