సైలెంట్‌గా ఓటీటీలోకి హౌస్‌ఫుల్ 5.. అక్షయ్ కుమార్ కామెడీ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీల లిస్ట్ తీస్తే ఖచ్చితంగా ఉండే పేరు హౌస్‌ఫుల్. ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ఐదో చిత్రం హౌస్‌ఫుల్ 5. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్ నటించిన ఈ చిత్రానికి తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహించగా.. నదియాద్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్ వాలా ఈ సినిమాను నిర్మించారు. జూన్ 6న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. థియేట్రికల్ రన్ పూర్తి కావడంతో తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..
హౌస్‌ఫుల్ 5 బడ్జెట్ ఎంత?
హౌస్‌ఫుల్ 5లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోనమ్ బజ్వా, నర్గీస్ ఫక్రీ, దినో మోరియా, సంజయ్ దత్, జాకీష్రాఫ్, నానాపటేకర్ వంటి భారీ తారాగణం ముఖ్యపాత్రలు పోషించించింది. వీ మనికందన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. జూలియస్ పాకియం, యోయో హనీ సింగ్, తన్షిక్ బాగ్చీ సహా దాదాపు 10 మంది సంగీత దర్శకత్వం వహించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ సహా ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి హౌస్‌ఫుల్ 5 చిత్రానికి దాదాపు 225 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

హౌస్‌ఫుల్ 5 బ్రేక్‌ఈవెన్ టార్గెట్ ఎంత?
హౌస్‌ఫుల్ ఫ్రాంచైజీకి ఉన్న బ్రాండ్‌తో పాటు అక్షయ్ కుమార్ నటన, టీజర్, ట్రైలర్‌ల కారణంగా హౌస్‌ఫుల్ 5కి ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా హౌజ్ ఫుల్ 5 మూవీకి రిలీజ్‌కు ముందే భారీ వ్యాపారం జరిగింది. హౌస్‌ఫుల్ 5 మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద రూ.240 కోట్లు వసూల్ చేయాలని ట్రేడ్ పండితులు నిర్ణయించారు. ఇక డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ద్వారా రూ.135 కోట్ల ఆదాయం వచ్చింది. ఇండియాలో 5000 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 7000 స్క్రీన్లలో హౌస్‌ఫుల్ 5 సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
హౌస్‌ఫుల్ 5 కలెక్షన్స్
240 కోట్ల రూపాయల కలెక్షన్స్ టార్గెట్‌గా బాక్సాఫీస్ వద్ద జర్నీ ప్రారంభించింది హౌస్‌ఫుల్ 5. తొలి రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రూపాయలకు పైగా ఓపెనింగ్స్ రాబట్టింది. 42 రోజుల వరకు హౌస్‌ఫుల్ 5 ఇండియాలో 183.37 కోట్ల రూపాయల నెట్.. 218.41 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఓవర్సీస్‌లో అక్షయ్ కుమార్‌కు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఈ సినిమాకు 70.25 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. వీటితో కలుపుకుని హౌస్‌ఫుల్ 5కు ప్రపంచవ్యాప్తంగా 288.66 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి లాభాలను అందించింది.
హౌస్‌ఫుల్ 5 ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హౌస్‌ఫుల్ 5 థియేట్రికల్ రన్ పూర్తి కావడంతో ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్‌గా ఓటీటీలో ప్రత్యక్షమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇక్కడే ఓటీటీ సంస్థ ట్విస్ట్ ఇచ్చింది. హౌస్‌ఫుల్ 5 సినిమాను చూడాలంటే రూ.349 అద్దె చెల్లించాల్సి ఉంటుందని అమెజాన్ ప్రైమ్ తెలిపింది. రెగ్యులర్ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వాళ్లు ఈ సినిమాను చూడలేరని పేర్కొంది. థియేటర్‌లో ఫర్వాలేదని అనిపించుకున్న హౌస్‌ఫుల్ 5 చిత్రం ఓటీటీలో ఎలాంటి ఆదరణను దక్కించుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











