OTTలోకి రీసెంట్ సూపర్ హిట్ యాక్షన్ ఎంటర్టైనర్... ఎందులో చూడాలంటే?

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్, అందాల భామ దీపిక పదుకుణె నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ఫైటర్. ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న థియేటర్లలోకి వచ్చి సందడి చేసింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రిమియర్ కు సిద్ధం అయింది. ఫైటర్ సినిమా ఏ ఓటీటీలో.. ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందో ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం.

ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా బాలీవుడ్ నుంచి వచ్చిన చిత్రం ఫైటర్. ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్, దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కింది. హృతిక్ రోషన్, దీపికా పదుకోణె హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే సిద్ధార్థ్ ఆనంద్ హృతిక్ రోషన్ తో బ్యాంగ్ బ్యాంగ్, వార్ చిత్రాలు తెరకెక్కించి సూపర్ హిట్లను అందించాడు. ఇక గత ఏడాది షారుక్ ఖాన్ తో పఠాన్ చిత్రంతో ఇండియాన్ బాక్సాఫీస్ ను షేక్ చేశాడు.

Hrithik Roshan Deepika Padukone Fighter Streaming on Netflix From March 21st Full Details Here

ఇక భారీ అంచనాలతో రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25వ తేదీన ఫైటర్ చిత్రం రిలీజ్ అయింది. అయితే బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా ఊహించినంత కలెక్షన్లు మాత్రం రాబట్టలేక పోయింది. ఈ సినిమా హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరుపుకుంది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 4200లకు పైగా థియేటర్లలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయింది.

సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే మిక్స్ డ్ టాక్ లభించింది. ఇక ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపుగా రూ.350 కోట్లకు పైగా వసూలు చేసింది. ఫైటర్ మూవీ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. హృతిక్ ఫైటర్ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కోనుగోలు చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమాను మార్చి 21వ తేదీన నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.

Hrithik Roshan Deepika Padukone Fighter Streaming on Netflix From March 21st Full Details Here

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుందని సమాచారం. ఇక ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఇందులోని శృంగారపు సీన్స్ మీద విమర్శలు వచ్చాయి. యూనిఫాంలో లిప్ కిసెస్ ఏంటని చాలా మంది విమర్శించారు.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తే.. హృతిక్ రోషన్, దీపికా పదుకుణె జంటగా నటించారు. అనిల్ కపూర్ కీలక పాత్రలో నటించారు. ఏరియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ కమ్ దేశభక్తి మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ యాక్షన్ సినిమాను వయాకామ్ 18 స్టూడియోస్, మార్ల్ఫిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై సిద్ధార్థ్ ఆనంద్, జ్యోతి దేశ్‌పాండే, అజిత్ సంయుక్తంగా నిర్మించారు. సంచిత్, అంకిత్, విశాల్ శేఖర్ సంగీతం అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X