OTTలోకి వచ్చేసిన హృతిక్ సూపర్ యాక్షన్ థ్రిల్లర్.. కానీ ఓ సస్పెన్స్!
ఓటీటీలోకి ఫైటర్ దిగాడు. అదేనండి బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్, దీపికా పదుకునే నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఫైటర్. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్దు రూ.350కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఎన్నో రోజులుగా ఈసినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులకు నేడు మోక్షం కలిగింది. ఇక ఈ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది.. దీని కథేంటి అనే వివరాలు పూర్తి కథనంలో తెలుసుకుందాం.
హృతిక్ ఆనంద్ కాంబోలో మూడవ చిత్రం...
బాలీవుడ్ స్టార్ హీరో, గ్రీకు వీరుడు హృతిక్ రోషన్, అందాల తార దీపికా పదుకునే హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ ఫైటర్. ఇక ఈ చిత్రాలు తెరకెక్కించే సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఆనంద్ గత ఏడాది పటాన్ చిత్రంతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఇక హృతిక్ ఆనంద్ కాంబోలో వచ్చిన బ్యాంగ్ బ్యాంగ్, వార్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. వీరి కాంబోలో వచ్చిన ఫైటర్ మాత్రం పర్వాలేదనిపించింది.

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం...
ఇక ఫైటర్ చిత్రంలో యానిమల్ నటుడు అనిల్ కపూర్, బిపాసా భర్త కరణ్ సింగ్ గ్రోవర్ కీలక పాత్రల్లో నటించారు. సిద్ధార్థ్ ఆనంద్ ఎయిర్ ఫోర్స్ బేస్డ్ కాన్సెప్ట్ మూవీగా దీనిని తెరకెక్కించాడు. గణతంత్ర దినోత్సవం కానుకగా ఈ ఏడాది జనవరి 25న థియేటర్లలోకి ఫైటర్ వచ్చేశాడు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా ఫైటర్ రిలీజ్ అయింది. ఫైటర్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఫైటర్ సినిమాపై ఫ్యాన్స్ దండయాత్ర...
హృతిక్ రోషన్, దీపిక పదుకునే విన్యాసాలకు బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ. 350 కోట్లు రాబట్టినట్లు సమాచారం. థియేటర్లలో ఆడియెన్స్ ను అలరించిన ఫైటర్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూశారు. ఇక వారి నిరీక్షణకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఫైటర్ ఓటీటీ రిలీజ్ డేట్ మీద బుధవారం అధికారిక ప్రకటన రాగా... గురువారం నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో ఫ్యాన్స్.. ఫైటర్ సినిమాపై దండయాత్ర చేస్తున్నారు.
తెలుగు అడియెన్స్ కు నిరాశ...
ఫైటర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో మార్చి 21 అంటే బుధవారం అర్ధరాత్రి నుంచే ఫైటర్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఒక్క హిందీలోనే స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో తెలుగు అడియెన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. దీంతో ఎంత మోసం చేశారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి తెలుగుతో పాటు రీజినల్ భాషల్లో ఎప్పుడు రిలీజ్ కానుందో చూడాలి.
ఇక ఫైటర్ సినిమా విషయానికి వస్తే...
యుద్ధ విమానాలతో కూడిన యాక్షన్, దేశభక్తి అంశాలతో తెరకెక్కింది. ఈ సినిమాలో అక్షయ్ ఒబెరాయ్, రిషబ్ సాహ్నీ, సంజీద షేక్, అషుతోశ్ రానా, గీతా అగర్వాల్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. వయాకామ్ 22 స్టూడియోస్, మార్ల్ఫిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై సిద్ధార్థ్ ఆనంద్, జ్యోతి దేశ్‌పాండే, అజిత్, అంకులు భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మించారు. అందుకు తగ్గట్టే ఇందులోని వీఎఫ్ క్స్, యాక్షన్ సీన్స్ ఆడియెన్స్ ను కట్టిపడేస్తాయి. మరి థియేటర్లలో ఫైటర్ సినిమాను మిస్ అయితే ఓటీటీలో చూసేయండి.


Click it and Unblock the Notifications











