OTTలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న అదిరిపోయే చిత్రాలివే.. అస్సలే మిస్ అవ్వొద్దు మరి!
రోజురోజుకూ ఓటీటీల హవా పెరుగుతూనే వస్తోంది. థియేటర్లకు వెళ్లి ఇష్టమైన సినిమాను ఎంత ఆసక్తిగా చూస్తారో ఓటీటీల వేదికగా కూడా అలాగే చేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంట్లోనే కూర్చుని ఎక్కువ మొత్తంలో అదిరిపోయే చిత్రాలు, వెబ్ సిరీస్ లు చూసేస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమా అయినా, థియేటర్లలో హిట్ టాక్ వచ్చిన చిత్రం అయినా ఎప్పటికప్పుడు చూస్తుండగా.. కొన్ని ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఆర్మాక్స్ మీడియా సంస్థ చేసిన సర్వే ప్రకారం ఏప్రిల్ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు టాప్ ట్రెండింగ్ లో నిలిచిన టాప్ 3 సినిమాల లిస్టును విడుదల చేసింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా ఏప్రిల్ 5వ తేదీ నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు టాప్ 3లో నిలిచిన సినిమాల్లో రెండు హిందీ చిత్రాలు ఉండగా ఓ తెలుగు సినిమా కూడా ఉంది. ఆర్మాక్స్ మీడియా సంస్థ చేసిన ఈ సర్వేలో హృతిక్ రోషన్ ఫైటర్ సినిమా టాప్ 1లో నిలిచింది. ముఖ్యంగా యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈ చిత్రాన్ని వయాకామ్ 18 స్టూడియోస్ మరియు మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ బ్యానర్‌పై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే నిర్మించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హృతిక్ రోషన్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొణే హీరోయిన్ గా నటించి మెప్పించింది.

వీరు మాత్రమే కాకుండా ఫైటర్ చిత్రంలో అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, కరణ్ సింగ్ గ్రోవర్, ఆమిర్ నాయక్ వంటి వాళ్లు కీలక పాత్రల్లో కనిపించారు. జనవరి 25వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టుకుని సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అలా థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా మార్చి 21వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుండగా.. చాలా మంది ఆసక్తిగా ఈ సినిమాను చూస్తున్నారు. అలా ఈ చిత్రం టాప్ 1 ట్రెండింగ్ లో నిలిచింది.

అలాగే టాప్ 2లో తెలుగు సినిమా హనుమాన్ నిలిచింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో తేజా సజ్జా హీరోగా చేశారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో తేజా సజ్జా సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, దీపక్ రాజ్ శెట్టి, సముద్రతని, గెటప్ శ్రీనఉఖ, సత్య, భాను ప్రకాశ్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయింది.
ముఖ్యంగా జనవరి 12వ తేదీన థియేటర్లలో విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీసును బద్ధలు కొట్టింది. అలా ఓ ట్రెండ్ సెట్ చేసిన ఈ సినిమా జియో సినిమా వేదికగా మార్చి 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక అప్పటి నుంచి ఓటీటీ ప్రియులు ఈ చిత్రాన్ని తెగ చూస్తుండగా.. రెండో స్థానంలో నిలిచిపోయింది. ఇక మూడో స్థానంలో తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా నిలిచింది. మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మించిన ఈ సినిమాకు అమిత్‌జోషి, ఆరాధనా సాహ్ దర్శకత్వం వహించారు.

ధర్మేంద్ర, డింపుల్ కపాడియా, షాహిద్ కపూర్, కృతి సనన్, రాకేష్ బేడీ, అనుభఆ ఫుతేపురియా, రాజేష్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఫిబ్రవరి 26వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేశారు. ఇలా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టుకున్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఏప్రిల్ 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అయితే అదిరిపోయే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రాన్ని చూసేందుకు అనేక మంది ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఈ సినిమా ట్రెండింగ్ లోకి వచ్చింది.


Click it and Unblock the Notifications











