ముందుగానే ఓటీటీలోకి 350 కోట్ల బ్లాక్ బస్టర్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే!

గతంలో కంటే ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా ఉన్న ఇండస్ట్రీల నుంచి చాలా మంది పాన్ ఇండియా స్టార్లు వచ్చారు. కానీ, బాలీవుడ్‌లో ఎప్పుడో ఆ రేంజ్ హీరోలు హవాను చూపించారు. వారిలో హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ ఒకడు. అప్పట్లో వరుస హిట్లతో సత్తా చాటిన అతడు.. ఈ మధ్య భారీ హిట్ కోసం చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే హృతిక్ 'ఫైటర్' అనే మూవీ చేశాడు.

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా నటించిన యాక్షన్ మూవీనే 'ఫైటర్'. సిద్దార్థ్ ఆనంద్ తీసిన ఈ సినిమా ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే హృతిక్ మూవీని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ మూవీకి ప్రీమియర్స్ నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే.

Hrithik Roshan Starrer Fighter Movie Digital Streaming Details

'ఫైటర్' మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి స్పందన భారీగానే లభించింది. ఫలితంగా ఈ చిత్రం ఫుల్ రన్‌లో రూ. 210 కోట్లు వరకూ నెట్ వసూళ్లను, రూ. 350 కోట్లు వరకూ గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. తద్వారా క్లీన్ హిట్‌గా నిలవడంతో పాటు లాభాలను కూడా అందుకుంది. అయితే, ఇప్పుడు ఈ సినిమా రన్ దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ పూర్తి అయిపోయింది.

దేశ భక్తిని రేకెత్తించే కథతో రూపొందిన 'ఫైటర్' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఏకంగా రూ. 180 కోట్ల రేటుకు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్‌పై అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది.

Hrithik Roshan Starrer Fighter Movie Digital Streaming Details

హృతిక్ రోషన్ నటించిన 'ఫైటర్' మూవీ స్ట్రీమింగ్ యాభై రోజుల తర్వాతనే ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంటే జనవరి 25న వచ్చిన ఈ చిత్రం మార్చి నాలుగో వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఇది మార్చి 2వ వారం నుంచే అందుబాటులోకి వస్తుందట. దీనిపై త్వరలోనే ప్రకటన రాబోతుందని టాక్.

ఇదిలా ఉండగా... క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'ఫైటర్' మూవీలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా, అనిల్ కపూర్ కీలక పాత్రను చేశారు. ఈ సినిమాను వయాకామ్ 22 స్టూడియోస్, మార్ల్ఫిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై సిద్ధార్థ్ ఆనంద్, జ్యోతి దేశ్‌పాండే, అజిత్, అంకులు నిర్మించారు. దీనికి సంచిత్, అంకిత్, విశాల్ శేఖర్ మ్యూజిక్ అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X