ఓటీటీలోకి సూపర్ హిట్ యాక్షన్ మూవీ.. ఎప్పుడు? ఎక్కడ? చూడాలంటే!

చాలా కాలం పాటు హిట్లు ముఖమే చూడని చాలా మంది బాలీవుడ్ హీరోలు.. ఈ మధ్యన విజయాలను అందుకుంటూ దూసుకుపోతోన్నారు. తద్వారా తమలోని సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నారు. అలాంటి వారిలో హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ ఒకడు. భారీ హిట్‌ను ఖాతాలో వేసుకోవాలన్న లక్ష్యంతో అతడు 'ఫైటర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన 'ఫైటర్' సినిమాను సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించాడు. ఈ మూవీ ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా హృతిక్ మూవీని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అయితే, ఈ మూవీకి ప్రీమియర్స్ నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది.

Hrithik Roshan Starrer Fighter Movie Digital Streaming From March 21st

'ఫైటర్' మూవీకి టాక్ పాజిటివ్‌గా రాకపోయినా ప్రేక్షకుల నుంచి స్పందన భారీగానే లభించింది. ఫలితంగా ఈ చిత్రం ఫుల్ రన్‌లో రూ. 210 కోట్లు వరకూ నెట్ వసూళ్లను, రూ. 350 కోట్లు వరకూ గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. తద్వారా క్లీన్ హిట్‌గా నిలవడంతో పాటు లాభాలను కూడా సొంతం చేసుకుంది. దీంతో హృతిక్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో నిలిచింది.

ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రూపొందిన 'ఫైటర్' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఏకంగా రూ. 180 కోట్ల రేటుకు తీసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్‌ డేట్‌పై అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది.

Hrithik Roshan Starrer Fighter Movie Digital Streaming From March 21st

హృతిక్ రోషన్ హీరోగా చేసిన 'ఫైటర్' మూవీ స్ట్రీమింగ్ యాభై రోజుల తర్వాతనే ఉంటుందని టాక్ వచ్చింది. అయితే, ఇది ముందే వచ్చే ఛాన్స్ ఉందని అన్నారు. కానీ అలా జరగలేదు. తాజా సమాచారం ప్రకారం.. 'ఫైటర్' మూవీ మార్చి 21వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుందట. దీనిపై ఈ రెండు రోజుల్లోనే అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు.

Hrithik Roshan Starrer Fighter Movie Digital Streaming From March 21st

ఇదిలా ఉండగా... క్రేజీ యాక్షన్‌తో రూపొందిన 'ఫైటర్' మూవీలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా, అనిల్ కపూర్ కీలక పాత్రను చేశారు. ఈ సినిమాను వయాకామ్ 22 స్టూడియోస్, మార్ల్ఫిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై సిద్ధార్థ్ ఆనంద్, జ్యోతి దేశ్‌పాండే, అజిత్, అంకులు నిర్మించారు. దీనికి సంచిత్, అంకిత్, విశాల్ శేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X