నితిన్ తమ్ముడు సినిమా ఓటీటీికి భారీ ధర.. ఎన్ని కోట్లు అంటే?
టాలీవుడ్ స్టార్ నితిన్ హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో అలరిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్య నితిన్ చివరిగా వరుస డిజాస్టర్ చిత్రాలను అందుకున్నారు. దాంతో ఆయన సినిమాలకు పెద్దగా డిమాండ్ కూడా లేదని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో నితిన్ తన రాబోయే చిత్రంతో షాకిచ్చారు. నితిన్ నెక్ట్స్ 'తమ్ముడు' చిత్రంతో రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. మరికొద్ది రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ అమ్మకాలపై తాజాగా అప్డేట్ అందింది. భారీ ధరకు అమ్ముడుపోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
వరుసగా 5 చిత్రాలు ఫ్లాప్..
నితిన్ కు ప్రస్తుతం కాలం కలిసి రావడం లేదు. ఎంత జోష్ గా, ఎలాంటి కంటెంట్ తో సినిమా తీసినా అది ఆశించిన మేర ఫలితాన్ని అందించడం లేదు. నాలుగేళ్లుగా నితిన్ కు ఒక్క హిట్ లేదు. చివరిగా భీష్మ, రంగ్ దే వంటి చిత్రాలతో సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన చెక్, మ్యాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్ట్స్రార్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్ వంటి చిత్రాలు వరుసగా ప్లాఫ్స్ ను అందించాయి. దీంతో నితిన్ గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. ఎలాగైనా హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు.

తమ్ముడు మూవీపైనే ఆశలు..
ప్రస్తుతం నితిన్ కు రాబోయే చిత్రం తమ్ముడు పైనే ఆశలు ఉన్నాయి. ఈ చిత్రం టైటిల్ తో ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 1999లో ప్రేక్షకులను అలరించారు. అప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇక నితిన్ కూడా ఆ మ్యాజిక్ ను రిపీట్ చేస్తారా? లేదా? అన్నది చూడాలి. ప్రస్తుతం ఈ చిత్రంపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
తమ్ముడు ఓటీటీ రైట్స్ కు భారీ ధర..
నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తమ్ముడు చిత్రం జూలై 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. దీంతో సినిమాకు సంబంధించిన ప్రీ బిజినెస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాగా తాజాగా తమ్ముడు చిత్రం ఓటీటీ రైట్స్ ను ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. మరోవైపు శాటిలైట్ రైట్స్ ను మా టీవీ దక్కించుకుంది. మొత్తంగా రూ.38 కోట్లకు డిజిటల్ రైట్స్ అమ్ముడుపోవడం విశేషం.
భారీ బడ్జెట్ తో నితిన్ తమ్ముడు సినిమా..
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, లయ హీరోయిన్లుగా నటించారు. బీ అంజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రూ.75 కోట్ల బడ్జెట్ వెచ్చించినట్టు నిర్మాత దిల్ రాజ్ చెప్పడం విశేషం. ఇక చిత్రంలో సౌరభ్ సచ్‌దేవా, స్వాసిక, హరి తేజ, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ప్రమోషన్స్ ను ప్రారంభించారు.


Click it and Unblock the Notifications











