Coolie OTT : రజనీకాంత్ కూలి ఓటీటీకి భారీ ధర.. ఎన్ని కోట్లో తెలుసా?
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ చివరిగా జైలర్ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇక నెక్ట్స్ కూలి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను ప్రారంభించారు. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ మూవీపై భారీ అంచనాలను పెంచేస్తున్నారు. ఇక 30 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందుతున్నాయి. తాజాగా కూలి చిత్రం ఓటీటీ హక్కులకు పలుకుతున్న ధర, పలు షరతులపై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
భారీ బడ్జెట్ తో కూలి చిత్రం..
సూపర్ స్టార్ రజనీకాంత్ - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో కూలి చిత్రం రూపుదిద్దుకోవడం విశేషం. అయితే ఈ చిత్రాన్ని కోలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. నిర్మాత కళానిధి మారన్ ఏకంగా రూ.350 కోట్ల బడ్జెట్ ను ఈ చిత్రానికి కేటాయించడం విశేషం. రజనీకాంత్ కాంత్ మార్కెట్, లోకేష్ కనగరాజ్ బ్రాండ్ కారణంగా ఇంత పెద్ద మొత్తంలో వెచ్చించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తై విడుదలకు సిద్ధంగా ఉంది.

కీలక పాత్రల్లో భారీ తారాగణం
కూలి చిత్రం తారా స్థాయి అంచనాలు పెరగడానికి కారణం ఈ సినిమాలో సౌత్ టాప్ స్టార్స్ నటించడమే. రజనీకాంత్ దేవా పాత్రలో నటిస్తుండగా.. సిమన్ పాత్రలో టాలీవుడ్ స్టార్ కింగ్ అక్కినేని నాగార్జున, కలీషా పాత్రలో కన్నడ రియల్ హీరో ఉపేంద్ర, మలయాళం సెన్సేషనల్ స్టార్ సౌబిన్ షహిర్ లు నటించడం విశేషం. ఇక మెయిన్ హీరోయిన్ గా శృతి హాసన్ నటించింది. మరోపాత్రలో యంగ్ బ్యూటీ రెబా మోనికా జాన్ నటించింది. స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే మోనికా అనే స్పెషల్ సాంగ్ తో దుమ్ములేపింది. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ క్యామియో అప్పీయరెన్స్ ఇవ్వబోతుండటం విశేషం.
కూలి ఓటీటీ రైట్స్ ధర?
ఇప్పటికే కూలి చిత్రానికి థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.550 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. దీంతో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ.600 కోట్ల వరకు వసూళ్లు రాబడితేనే లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందని బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను నిర్ణయించారు. ఇక తాజాగా కూలీ చిత్రం ఓటీటీకి సంబంధించిన వివరాలు ఆసక్తికరంగా మారాయి. కూలి చిత్రానికి సంబంధించిన ఓటీటీ రైట్స్ కు భారీ ధర పలుకుతోందని టాక్.
ఏకంగా రూ.130 కోట్లకు ఓటీటీ హక్కులు అమ్మకానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని రిలీజైన 4 వారాల్లో ఓటీటీలో విడుదల చేస్తే రూ.130 కోట్లు, 8 వారాల్లో విడుదల చేస్తే రూ.115 కోట్లు చెల్లించేందుకు ఓటీటీ సంస్థ సిద్ధంగా ఉందని ప్రచారం. ఇక మేకర్స్ మాత్రం ఈ చిత్రాన్ని 8 వారాల తర్వాతనే ఓటీటీలోకి అనుమతించ బోతున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటికీ వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.


Click it and Unblock the Notifications











