OTT విచ్చలవిడిగా శృంగారం.. హద్దు మీరుతున్న దర్శకులపై కఠిన చర్యలు.. కేంద్ర మంత్రి వార్నింగ్
ప్రపంచ సినిమా పరిశ్రమలో ఓటీటీ (ఓవర్ ది టాప్) ఫ్లాట్‌ఫామ్స్ వచ్చిన తర్వాత ప్రేక్షకుల అభిరుచి మాత్రమే కాదు.. సినీ నిర్మాత దర్శకుల విజన్ పూర్తిగా మారిపోయింది. తమ సృజనాత్మకతకు పదును పెడుతూ అద్బుతమై సినిమాలను, వెబ్ సిరీస్‌లను అందిస్తున్నారు. అయితే కొన్ని వెబ్ సిరీస్‌లు శృంగారం, అశ్లీలత, అసభ్యత, హింస విషయంలో హద్దు దాటుతున్నదనే వాదన బలంగా వినిపిస్తున్నది. ఈ క్రమంలో తాజాగా ఓటీటీ కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించేందుకు సిద్దమైంది. కేంద్ర సమాచార శాఖ మంత్రి ఘాటుగా స్పందించడం వివాదంగా మారింది. ఈ వివాదం వెనుక కారణాలు.. కేంద్ర మంత్రి అనురాగ్ థాకూర్ ఏమన్నారంటే?

ఫ్యామిలీతో చూడలేకపోతున్నాం..
ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో కొన్ని అద్బుతమైన సినిమాలు, వెబ్ కంటెంట్ ప్రేక్షకులకు చేరువైంది. థియేటర్లకు రాలేని ప్రేక్షకులు ఓటీటీ ద్వారా గొప్ప అనుభూతిని పొందుతున్నారు. అలాగే కొందరు ఫ్యామిలీతో చూడలేని పరిస్థితి నెలకొన్నదనే ఆరోపణలు కూడా చేస్తున్నారు.

భావ ప్రకటిత స్వేచ్ఛ పేరుతో
ఇక ముఖ్యంగా రానా నాయుడుతోపాటు మరికొన్ని వెబ్ సిరీస్‌లు కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తారు. అశ్లీల సన్నివేశాలు, మితిమీరిన శృంగారం అసభ్యకరంగా మారిందని విషయం చర్చనీయాంశమైంది. భావ ప్రకటిత స్వేచ్చ అనే వెసులుబాటుతో దర్శకులు హద్దు మీరుతున్నారనే చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర సమాచారశాఖ మంత్రి తీవ్ర స్వరంతో హెచ్చరించింది.

ఓటీటీలో పెరుగుతున్న అశ్లీల
కేంద్రమంత్రి అనురాగ్ థాకూర్ మీడియాతో మాట్లాడుతూ.. క్రియేటివిటి పేరుతో అశ్లీలత, బరితెగింపుకు పాల్పడుతున్నారు. అలాంటి విషయాలను చూస్తూ ఊరుకోం. ఓటీటీలో పెరుగుతున్న అశ్లీల విషయంలో అనేక ఫిర్యాదులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ఒకవేళ అవసరం ఉందనిపిస్తే.. ఓటీటీకి సంబంధించిన మార్గదర్శకాలను, సెన్సార్ విషయంపై కేంద్ర వెనుకాడదు అని కేంద్ర మంత్రి అన్నారు.

తీవ్రమైన నిర్ణయాలు తీసుకొంటాం
సినిమా పరిశ్రమకు సంబంధించిన ఫిర్యాదులు, సినిమాలకు సంబందించిన కంప్లయింట్స్ ఉంటే.. సలహా, సూచనలతో నిర్మాత వాటిని సరిద్దిద్దుతారు. కొన్ని మా తరఫున వాటిని పరిష్కరిస్తూ వచ్చాం. కానీ ప్రస్తుతం ఓటీటీలో అసభ్యత పెరిగిపోతుందనే ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. వాటిపై మేము తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్దంగా ఉన్నాం అని కేంద్ర మంత్రి అనురాగ్ థాకూర్ స్పష్టం చేశారు.
బూతులు, అశ్లీలత విషయం కఠిన చర్యలు
క్రియేటివిటి పేరులో అసభ్యత, బూతులు మాట్లాడటం సరికాదు. క్రియేటివిటి కోసం స్వేచ్ఛ ఇచ్చాం. బూతులు, అశ్లీలత కోసం స్వేచ్చ ఇవ్వలేదు. ఫిర్యాదుల పెరిగితే అశ్లీలత, అసభ్యత విషయంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ కఠినమైన నిర్ణయాలు తీసుకొంటుంది అని అనురాగ్ థాకూర్ హెచ్చరించారు.


Click it and Unblock the Notifications











