twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Stranger Things 4 మ్యూజిక్‌తో అదరగొట్టిన ఇళయరాజా.. (వీడియో)

    |

    ఎన్నో రోజుల నుంచి ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ 4 తొలి భాగం విడుదలకు సిద్ధమైంది. పాపులర్ ఓటీటీ ఫ్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ మే 27వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ 4వ సీజన్‌కు సంబంధించిన రెండో భాగం జూలై 1వ తేదీన విడుదలవ్వనున్నది. గతంలో వచ్చిన స్ట్రేంజర్ థింగ్స్ కంటే ఈ సీజన్ ఎలా భిన్నంగా ఉంటుందనే విషయం మాలో ఆసక్తిని పెంచుతున్నదనే విషయాన్ని అభిమానులు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు.

    అయితే ఇటీవల భారీగా సబ్‌స్కైబర్స్‌ను కోల్పోయిన నెట్ ఫ్లిక్స్ సంస్థ స్ట్రేంజర్ థింగ్స్ 4 ద్వారా మళ్లీ భారీగా ఖాతాదారులను సంపాదించుకొనే పనిలో పడింది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను గతంలో మునుపెన్నడూ లేని విధంగా ప్రమోట్ చేస్తున్నది. మానవులకు, మానవేతరులకు మధ్య జరిగే సంఘర్షణ ప్రేక్షకులకు ఆసక్తిని రేపుతున్నది.

     Ilaiyaraaja music video for Stranger Things 4 goes viral

    స్ట్రేంజర్ థింగ్స్ 4 సిరీస్‌కు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా మారబోతున్నది. ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ అందిస్తున్న సమయంలో చిత్రీకరించిన వీడియోను ప్రోమోగా మలిచారు. ప్రస్తుతం ఆ వీడియోను నెట్‌ఫ్లిక్స్ భారీగా ప్రమోట్ చేస్తున్నది. ఈ సిరీస్‌కు అద్బుతమైన బీజీఎంగా ఉంటుందనే భావనను ఈ ప్రోమో క్రియేట్ చేసింది.

    English summary
    Stranger Things 4 season volume 1 hits the screen on netflix ott. Here is Ilaiyaraja's BGM video.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X