Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- News రేవంత్‌కు అందుకే నాపై కక్ష: కాళేశ్వరం, కవిత అరెస్టుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Stranger Things 4 మ్యూజిక్‌తో అదరగొట్టిన ఇళయరాజా.. (వీడియో)
ఎన్నో రోజుల నుంచి ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ 4 తొలి భాగం విడుదలకు సిద్ధమైంది. పాపులర్ ఓటీటీ ఫ్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ మే 27వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ 4వ సీజన్‌కు సంబంధించిన రెండో భాగం జూలై 1వ తేదీన విడుదలవ్వనున్నది. గతంలో వచ్చిన స్ట్రేంజర్ థింగ్స్ కంటే ఈ సీజన్ ఎలా భిన్నంగా ఉంటుందనే విషయం మాలో ఆసక్తిని పెంచుతున్నదనే విషయాన్ని అభిమానులు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇటీవల భారీగా సబ్‌స్కైబర్స్‌ను కోల్పోయిన నెట్ ఫ్లిక్స్ సంస్థ స్ట్రేంజర్ థింగ్స్ 4 ద్వారా మళ్లీ భారీగా ఖాతాదారులను సంపాదించుకొనే పనిలో పడింది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను గతంలో మునుపెన్నడూ లేని విధంగా ప్రమోట్ చేస్తున్నది. మానవులకు, మానవేతరులకు మధ్య జరిగే సంఘర్షణ ప్రేక్షకులకు ఆసక్తిని రేపుతున్నది.
స్ట్రేంజర్ థింగ్స్ 4 సిరీస్‌కు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా మారబోతున్నది. ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ అందిస్తున్న సమయంలో చిత్రీకరించిన వీడియోను ప్రోమోగా మలిచారు. ప్రస్తుతం ఆ వీడియోను నెట్‌ఫ్లిక్స్ భారీగా ప్రమోట్ చేస్తున్నది. ఈ సిరీస్‌కు అద్బుతమైన బీజీఎంగా ఉంటుందనే భావనను ఈ ప్రోమో క్రియేట్ చేసింది.
MAESTRO @ilaiyaraaja's VERSION OF THE STRANGER THINGS THEME HAS TURNED OUR WORLD UPSIDE DOWN! 💥🤯💥🤯💥🤯💥🤯#StrangerThings #sƃuᴉɥʇɹǝƃuɐɹʇs pic.twitter.com/I22DNLgT7C
— Netflix India South (@Netflix_INSouth) May 25, 2022