వేరే వాళ్లతో డేటింగ్.. పెళ్లి తర్వాత ఆ సమస్యలు.. ఓటీటీలోకి వచ్చిన బోల్డ్ మూవీ
సాధారణంగా బోల్డ్ కంటెంట్‌తో వచ్చే సినిమాలను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించరు. దీంతో ఇలాంటి చిత్రాలు గతంలో పెద్దగా వచ్చేవి కూడా కాదు. కానీ, ఇప్పుడు ఓటీటీల వాడకం పెరగడంతో ఈ తరహా సినిమాలు ఎక్కువగా రూపొందుతోన్నాయి. అలా ఇప్పటికే చాలా చిత్రాలు వచ్చి సెన్సేషన్ అయ్యాయి. ఈ క్రమంలోనే రూపొందిన మరో చిత్రమే 'దో ఔర్ దో ప్యార్'.
స్టార్ హీరోయిన్లు విద్యా బాలన్, ఇలియానా ప్రధాన పాత్రల్లో శిర్షా గుహ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే 'దో ఔర్ దో ప్యార్'. పెళ్లి చేసుకున్న ఓ జంట.. గతంలో తాము వ్యవహారం నడిపిన ఇద్దరి వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనే కాన్సెప్టుతో ఈ సినిమా రూపొందింది. దీనికితోడు ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ మూవీ ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది.

మంచి హైప్‌తో 'దో ఔర్ దో ప్యార్' మూవీ ఏప్రిల్ 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల అయింది. కానీ, ఆరంభంలోనే ఈ సినిమాకు మంచి టాక్ రాలేదు. అయినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శననే కనబరించింది. ఫలితంగా డీసెంట్ కలెక్షన్లను కూడా సొంతం చేసుకుంది. తద్వారా చాలా కాలం తర్వాత ఇలియానాకు విజయాన్ని అందించింది.
బోల్డు కంటెంట్‌తో రూపొందిన మూవీ కావడంతో పాటు విడుదలకు ముందే అంచనాలను ఏర్పరచుకోవడంతో 'దో ఔర్ దో ప్యార్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థ నుంచి మంచి పోటీనే ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ సొంతం చేసుకుంది. ఇందుకోసం మంచి మొత్తాన్నే నిర్మాతలకు ముట్టజెప్పినట్లు తెలిసింది.

ఇలియానా, విద్యా బాలన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'దో ఔర్ దో ప్యార్' మూవీని హాట్‌స్టార్ వీడియో సంస్థ గత అర్ధరాత్రి నుంచే ఎలాంటి ప్రకటన లేకుండానే స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చేసింది. సాధారణ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లు కూడా ఈ సినిమాను అందులో చూసేలా స్ట్రీమింగ్ చేస్తోంది. ఇక, థియేటర్లలో మాదిరిగా కాకుండా హాట్‌స్టార్ వీడియోలో 'దో ఔర్ దో ప్యార్'కు మంచి రెస్పాన్స్ లభిస్తోందని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా..శిర్షా గుహ రూపొందించిన 'దో ఔర్ దో ప్యార్' చిత్రాన్ని సమీర్ నాయర్, దీపక్ సెగల్, తనూజ్ గార్గ్, అతుల్, స్వాతి అయ్యర్‌లు నిర్మించారు. ఇందులో ప్రతీక్ గాంధీ, సెంథిల్ రామమూర్తి, తలైవాసల్ విజయ్, రేఖ కుడ్లిగి, గిరీష్ క్రిష్ నాయర్ తదితరులు నటించారు. ఈ మూవీకి చాలా మంది సంగీత దర్శకులు మ్యూజిక్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











