Inaya Sulthana Elimination పొలిటికల్ పవర్‌తోనే ఇనయా సుల్తానా బలి.. బిగ్‌బాస్ నిర్వాహకులపై దారుణంగా ట్రోలింగ్

బిగ్‌బాస్ తెలుగు 6 రియాలిటి షో తుదివారానికి చేరుకొన్నది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలోని సెట్‌ను గ్రాండ్ ఫినాలే కోసం సిద్దం చేస్తున్నారు. అయితే ఈ 14వ వారం తుది ఎలిమినేషన్‌‌లో టాప్ కంటెస్టెంట్ ఇనయా సుల్తానా ఎలిమినేట్ అయ్యారనే వార్త అభిమానులను షాక్ గురిచేసింది. టాప్ 5లో స్థానం సంపాదిస్తుందనుకొన్న ఇనయా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతున్నారనే విషయంపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం INAYA UNFAIR ELIMINATION అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తున్నారు. ఈ వివాదాస్పద ఎలిమినేషన్ వివరాల్లోకి వెళితే..

 ఇనయ వన్ ఉమెన్ ఆర్మీ

ఇనయ వన్ ఉమెన్ ఆర్మీ

ఇనయా సుల్తానా ఎలిమినేషన్ గురించి ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఇనయ వన్ ఉమెన్ ఆర్మీ, ఈ సీజన్ ట్రోఫిని గెలుచుకోవడానికి ఆమెకే ఎక్కువ ఛాన్స్ ఎందుకు ఉన్నందంటే.. పురుషులతో సమానంగా టాస్కులు ఆడింది. మాట్లాడేటప్పుడు చాలా క్లారిటీతో వ్యవహరించింది. ఎదుటి కంటెస్టెంట్ మీద జెలసీ ఫీల్ కాలేదు. తన వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని కూడా క్షమించింది. తన మాటలతో ఎవ్వరిని కించపరచలేదు. బాధపెట్టలేదు అని అన్నాడు.

 బిగ్‌బాస్ మేనేజ్‌మెంట్ పక్షపాతంగా

బిగ్‌బాస్ మేనేజ్‌మెంట్ పక్షపాతంగా


బిగ్‌బాస్ తెలుగు 6 షోలో విజేతగా నిలుస్తాను అని ఇనయా కాన్ఫిడెన్స్‌గా చెప్పింది. ఇప్పుడు అదే ప్రూవ్ చేసింది. బిగ్‌బాస్ తెలుగు 6 మేనేజ్‌మెంట్ పక్షపాతంగా వ్యవహరించి ఆమెను ఎలిమినేట్ చేసింది. ఇతరుల అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ.. ప్రజలు, అభిమానుల హృదయంలో ఇనయ సుల్తానా విజేతగా నిలిచింది.

 ఎందుకు ఎలిమినేట్ చేసిందో

ఎందుకు ఎలిమినేట్ చేసిందో


బిగ్‌బాస్ తెలుగు 6 షో నుంచి ఇనయా సుల్తానా ఎలిమినేట్ కావడం షాకింగ్‌గా ఉంది. వాస్తవంగా ఆమెకు వచ్చిన ఓటింగ్‌తో రెండో స్థానంలో ఉంది. మరి స్టార్ మా ఎందుకు ఎలిమినేట్ చేసిందో అర్ధం కావడం లేదు. తక్కువ టీఆర్సీ ఉన్నందున బజ్ కోసం ఇనయా సుల్తానాను ఎలిమినేట్ చేసిందా? అనే అనుమానాన్ని ఓ నెటిజన్ వ్యక్తం చేశాడు.

సీజన్ 6‌లో ఇనయా లేడీ టైగర్


ఇనయా సుల్తానా ఎలిమినేషన్ వేరి వెరీ బిగ్ షాకింగ్. టాప్ కంటెస్టెంట్ 2, సీజన్ 6‌లో లేడీ టైగర్. ఇప్పటి వరకు బిగ్‌బాస్ తీసుకొన్న చెత్త నిర్ణయం. మేనేజ్‌మెంట్ తన కోటాను పెట్టుకోవడానికి ఎలిమినేషన్‌లో పాలిటిక్స్ ప్లే చేసింది. టాప్ 2 కంటెస్టెంట్ అన్ ఫెయిర్‌గా ఎలిమినేట్ చేస్తున్నారు. ఒక కంటెస్టెంట్‌ కి ఉన్న పొలిటికల్ పవర్‌తో మొన్న రాజ్, ఇప్పుడు ఏకంగా టాప్ 2 కంటెస్టెంట్ బలి అని ఓ నెటిజన్ ఎమోషనల్‌గా పోస్టు పెట్టారు.

ఇనయా ఒంటరిగా పోరాటం


ఇనయా సుల్తానాను రేటింగ్ కోసం స్టార్ మా చివరి వారం వరకు వాడుకొన్నది. టీటీఎఫ్ లాంటి బోరింగ్ టాస్క్‌ను కూడా ఆసక్తికరంగా ఆడింది. టాస్క్‌ను స్పైస్‌తో నింపేసింది. ఒంటరిగా పోరాటం చేసింది. ఈ సీజన్‌లో ముక్కుసూటిగా ఉన్న వారిలో ఇనయా ఒక్కతే కనిపించింది. అన్ని ప్రతికూలతలను ఎదురించిన ఓ బలమైన మహిళా కంటెస్టెంట్‌ను స్టార్ మా ఎలిమినేట్ చేసిందంటూ ఓ నెటిజన్ తన ఆక్రోషాన్ని ట్విట్టర్‌లో వెల్లగక్కాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X