Indian Idol 2: బాలయ్యతో సరికొత్తగా ఆహా.. ఈ లుక్ చూస్తే విజిల్ వేయాల్సిందే!

ఆహా ఇండియన్ ఐడల్ రెండవ సీజన్‌ కూడా గ్రాండ్ గా స్టార్ట్ కాబోతోంది. దాని పై క్రేజ్ సోషల్ మీడియాలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక "గాలా విత్ బాలా" పేరుతో ఒక ఎపిసోడ్ యొక్క స్నీక్ పీక్ ఇటీవల విడుదల చేశారు. ఇందులో మాస్ హీరో బాలకృష్ణ ఉబెర్-స్టైలిష్ అవతార్‌లో కనిపించారు. అది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

మార్చి 17, 18 తేదీల్లో స్ట్రీమింగ్ కానున్న ఉన్న ఈ ఎపిసోడ్ విజువల్ ట్రీట్‌గా ఉంటుందని అనిపిస్తోంది. ఎందుకంటే బాలకృష్ణ తన ట్రేడ్‌మార్క్ స్వాగ్ డ్యాన్స్ ను ఆహా వారు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. గతంలో ఆహాలో ప్రముఖ టాక్ షో "అన్‌స్టాపబుల్ విత్ NBK"ని హోస్ట్ చేసిన బాలయ్య ఇప్పుడు ఇండియన్ ఐడల్ 2ని గ్రాండ్ గా ప్రారంభించాలని ఫిక్స్ అయ్యారు.

Indian idol 2 nandamuri balakrishna stylish look never before

స్టార్ సంగీత దర్శకుడు థమన్ ప్రముఖ నేపథ్య గాయకుడు కార్తీక్ కొత్త సీజన్‌కు ప్రధాన న్యాయనిర్ణేతలుగా ఉండగా న్యాయనిర్ణేత ప్యానెల్‌ లో వారితో పాటు మరో ప్రతిభావంతులైన నేపథ్య గాయని గీతా మాధురి కూడా చేరింది. మొదటి సీజన్ కంటే రెండవ సీజన్ ఇంకా గ్రాండ్ గా మొదలు కాబోతోంది. ఆహాలో ఇండియన్ ఐడల్ యొక్క మొదటి సీజన్ భారీ విజయాన్ని సాధించింది.

Indian idol 2 nandamuri balakrishna stylish look never before

దేశంలోని అనేక మంది ప్రతిభావంతులైన గాయకులు తమ నైపుణ్యాలను ప్రదర్శించి అగ్రస్థానం కోసం పోటీ పడ్డారు. ఇక కొత్త సీజన్ లో మరింత ప్రతిభావంతులైన పోటీదారులు, ఊహించని టాస్క్‌లను ఎదుర్కోబోతున్నారు. ఇక ఇండియన్ ఐడల్ కోసం బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంచనాలు ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. బాలయ్య ఏ విధంగా డ్యాన్స్ చేస్తాడు అనే విజువల్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.
మరి ఈసారి ఇండియన్ ఐడల్ ఏ స్థాయిలో క్రేజ్ అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X