OTTలోకి డైరెక్ట్‌గా యాక్షన్ థ్రిల్లర్ డ్రామా... ఎందులో చూడాలంటే?
బాలీవుడ్ పోలీస్ జానర్ చిత్రాలంటే మొదట గుర్తుకువచ్చేది బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి అనే విషయం తెలిసిందే. ఆయన ఇప్పటికే సింగం సిరీస్ వంటి చిత్రాలు తెరకెక్కించి సూపర్ హిట్లను అందుకున్నారు. 'సింగం', సింగం 3, సింబా, సూర్యవంశ్ వంటి కాప్ సినిమాలతో బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కించాడు. ఇప్పుడు ఆయన తాజాగా మరో పోలీస్ డ్రామా 'ఇండియన్ పోలీస్ ఫోర్స్'తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఓటీటీలోకి సూపర్ హిట్ పోలీస్ డ్రామా రాబోతుంది. ఓటీటీ ప్రేక్షకుల టెస్టుకు అనుగుణంగా కొత్త కొత్త కంటెంట్ ను తీసుకువస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై ఎన్నో యాక్షన్ థ్రిల్లర్ జోనర్లలో వచ్చిన సినిమాలు, సిరీసులు రిలీజ్ అయి ఆకట్టుకుంటుంది. ఇప్పుడు మరో సిరీస్ రాబోతుంది.

పోలీస్ జానర్ చిత్రాలు తెరకెక్కించే రోహిత్ శెట్టి-సుశ్వంత్ ప్రకాశ్ దర్శకత్వంలో రూపొందిన తాజా పోలీస్ డ్రామా 'ఇండియన్ పోలీస్ ఫోర్స్'. ఈ సిరీసును రియలన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ తో కలిసి రోహిత్ శెట్టి నిర్మించాడు. ఈ సిరీస్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. జనవరి 19వ తేదీ నుంచి ఓటీటీలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందులోబాటులోకి రానుంది.
ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఇషా తల్వార్, విభూతి ఠాకూర్, కరణ్‌వీర్ మల్హోత్రా, నికితిన్ ధీర్, శ్వేతా తివారీ, శరద్ కేల్కర్, ముఖేష్ రిషి, మృణాల్ కులకర్ణి, మయ్యంక్ టాండన్, వైదేహి పరశురామి, రీతూ రాజ్ సింగ్ తదితరులు ఈ సిరీస్‌లో కీలక పాత్రల్లో నటించారు.

భారత రాజధాని ఢిల్లీలో విధ్వంసం కలిగించే వరుస బాంబు పేలుళ్లు అవుతుంటాయి. అయితే ఈ పేలుళ్ల వెనక ఉంది ఎవరు అని తెలుసుకోవడానికి ఇండియన్ పోలీస్ ఫోర్స్ ముగ్గురు పవర్ ఫుల్ ఆఫీసర్స్ రంగంలోకి దిగుతారు. వారే సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి మరియు వివేక్ ఒబెరాయ్. ఇక బాంబ్ బ్లాస్టులు చేసింది ఎవరనేది తెలుసుకోవడానికి ఈ ముగ్గురు చేసే విన్యాసాలు ప్రేక్షకులను ఏవిధంగా ఆకట్టుకున్నాయి... వారు ఎలా దేశాన్ని కాపాడారు అనేది తెలియాలంటే... ఈ సిరీస్ చూడాల్సింది. మీరు ఈ సిరీస్ ను ఇంట్లోనే జనవరి 19న అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసేయొచ్చు.


Click it and Unblock the Notifications











