Indian Spy Movies on Netflix: ధురంధర్ 2 ఊపు.. నెట్‌ఫ్లిక్స్‌లో స్పై మూవీస్ హవా, టాప్‌లో ఏ సినిమా అంటే?

ఆదిత్యధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ ది రివెంజ్ (ధురంధర్ 2) బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర సాగిస్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా 850 కోట్లకు కలెక్షన్స్ సాధించి 1000 కోట్ల దిశగా అడుగులు వేస్తోంది. బుధవారం నాటికి ధురంధర్ 2 మూవీ ఈ మార్క్ చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అదే నిజమైతే తొలి వారంలోనే 1000 కోట్ల మార్క్ దాటిని సినిమాగా పుష్ఫ 2 సరసన ధురంధర్ 2 చోటు దక్కించుకోనుంది.

ధురంధర్ సిరీస్‌కు ప్రేక్షకుల ఫిదా
పాకిస్తాన్‌లో ఉగ్రవాద మూలాలు, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న టెర్రర్ క్యాంప్‌లను భారత గూడఛార సంస్థ (రా) ఎలా నాశనం చేసింది అనేదానిని ధురంధర్ తొలి భాగంలో చూపించారు. ఇక రెండో భాగంలో భారత్‌లో ప్రకంపనలు సృష్టించిన పెద్ద నోట్ల రద్దు దాని వెనుక ఉన్న కారణాలు, భారత్‌లో ఉగ్రవాదాన్ని చొప్పించేందుకు పాక్‌లోని కొన్ని శక్తులు ఎలాంటి కుట్రలు చేశాయి? వాటిని హీరో ఎలా ఎదుర్కొని భారతదేశాన్ని కాపాడాడు అన్నది చూపించారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎన్నో స్పై మూవీస్ ఇప్పటి వరకు వచ్చినప్పటికీ.. ధురంధర్‌లో చూపించిన విధంగా డిటెయిల్డ్ విశ్లేషణ, కథ ఎందులోనూ కనిపించదు. అందుకే ఫ్యూచర్‌లో స్పై మూవీస్ తీయాలనే వారికి ధురంధర్ సిరీస్‌తో ఆదిత్యధర్ కొత్త బెంచ్ మార్క్ నిర్దేశించారు.

Indian Spy Movies Trending on Netflix After Dhurandhar 2 Success Audience Shows Massive Interest on these films

టాప్ ట్రెండింగ్‌లో ఇండియన్ స్పై మూవీస్
ధురంధర్ 2 బ్లాక్‌బస్టర్ నేపథ్యంలో ప్రేక్షకులు గతంలో వచ్చిన స్పై మూవీస్ చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దాంతో అన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లలోనూ స్పై మూవీస్ టాప్ ట్రెండింగ్‌లోకి వస్తున్నాయి. ప్రత్యేకించి పాకిస్తాన్‌‌లో మన స్పై మూవీస్ హల్‌చల్ చేస్తుండటం విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న బెస్ట్ స్పై మూవీస్‌ను పరిశీలిస్తే.. రొమియా అక్బర్ వాల్టర్ (2019), కుఫియా (2023), మిషన్ మజ్ను (2023), నామ్ షబానా (2017), తిరంగా (2022), ఫోర్స్ 2 (2016), ఫాంటామ్ (2015), రాజీ (2018), మద్రాస్ కేఫ్ (2013), వార్ (2019), ధురంధర్ (2019)లు నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్నాయి.

పాక్‌లో భారతీయ సినిమాల హవా
ధురంధర్ 2 ప్రభంజనంలో నేపథ్యంలో భారత్‌, పాకిస్తాన్‌ ఇతర దక్షిణాసియా దేశాలలో భారతీయ సినిమాలు ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లోకి వస్తున్నాయి. పైన తెలిపిన సినిమాలలో ప్రధానంగా మూడు సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లో హవా చూపిస్తున్నాయి. గతేడాది విడుదలైన ఆదిత్యధర్- రణ్‌వీర్ సింగ్‌ల ధురంధర్ ఇంకా పాకిస్తాన్‌ని ఊపేస్తోంది. దాదాపు 52 రోజులుగా పాకిస్తాన్ నెట్‌ఫ్లిక్స్‌లో ధురంధర్ తొలి భాగం టాప్ 5లో కొనసాగుతోంది. ధురంధర్ తర్వాత ఇటీవల సన్నీడియోల్ నటించిన డ్రామా బోర్డర్ 2 సత్తా చాటుతోంది.

1971లో భారత్ - పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన బోర్డర్ 2 కూడా పాక్ ప్రజలను ఆకట్టుకుంటోంది. తమ దేశానికి వ్యతిరేకంగా తీసిన అయినప్పటికీ ఇందులోని యాక్షన్ సీక్వెన్స్, డ్రామాకు వారు ఫిదా అవుతున్నారు. వీటితో పాటు మేఘనా గుల్జర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించిన రాజీ (2018) కూడా నెట్‌ఫ్లిక్స్‌లో మంచి వ్యూయర్‌షిప్ సాధిస్తోంది. భారత ఏజెంట్‌గా ఉన్న అలియా భట్.. పాక్ ఆర్మీ ఆఫీసర్ ఇంటికి కోడలిగా వెళ్లి అత్యంత రహస్య సమాచారాన్ని ఎలా సేకరించింది? ఈ క్రమంలో ఎదురైన పరిస్ధితులు ఏంటీ? అనేది రాజీ మూవీ కథ. ఈ మూడింటితో పాటు ఫోర్స్ 2, వార్, ఏజెంట్ వినోద్, టైగర్ జిందా హై తదితర సినిమాలు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇండియన్ స్పై మూవీస్ ఓటీటీలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X