Year End 2023 ఇండియాలో 2023 టాప్ 10 వెబ్ సిరీసులివే.. అస్సలు మిస్ అవ్వొద్దు!
ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు, సిరీసులు రిలీజ్ అవుతాయి. అయితే అందులో టాప్ 10 ఏవి అంటే కరెక్టుగా చెప్పలేం. వీటిపై ప్రముఖ ఐఎండీబీ సంస్థ మోస్ట్ పాపులర్ టాప్ 10 వెబ్ సిరీసుల లిస్టును విడుదల చేసింది. ఈ సంవత్సరం అనగా 2023 వచ్చిన చూడాల్సిన టాప్ 10 వెబ్ సిరీస్‌ల లిస్టును రిలీజ్ చేసింది. ఇక ఈ సంవత్సరంలో వచ్చిన ది బెస్ట్ 10 వెబ్ సిరీసులు ఏంటి.. అందులో మన తెలుగు సిరీసులు ఏమైనా ఉన్నాయా.. ఏ ఏ సిరీసులు ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఈ ఏడాది ఎన్నో సినిమాలు, సిరీసులు రిలీజ్ అయి ప్రేక్షకులను అలరించాయి. ఇక 2023లో వచ్చిన టాప్ 10 వెబ్ సిరీసుల లిస్టును ఐఎండీబీ విడుదల చేసింది. ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన టాప్ 10 వెబ్ సిరీసులు ఇవే అంటూ ప్రకటించింది. అయితే హిట్టుగా నిలిచిన ఆ సిరీసులు, ఏవి, ఏ భాషలకు చెందిన సిరీసులు ఎక్కువగా టాప్ లో నిలిచాయో తెలుసుకుందాం.

ముఖ్యంగా ప్రముఖ ఓటీటీ సంస్థలు అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, జీ5, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జియో సినిమాల్లో నేరుగా విడుదలై అయి హిట్లుగా నిలిచిన సిరీసులు ఉన్నాయి. అవేంటంటే... టాప్ 1లో విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్, రాశికన్న నటించిన ఫర్జీ నిలిచింది. ఈ సీరిస్ దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను అలరించింది. ఈ సీరిస్ ను రాజ్ అండ్ డేకే తెరకెక్కించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సీరిస్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఓటీటీల్లో మోస్ట్ పాపులర్ టాప్ 10 వెబ్ సిరీసులివే...
1. ఫర్జి - అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్
2. గన్స్ గులాబ్స్ - నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్
3. నైట్ మేనేజర్ - డిస్ని ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్
4. కోహ్రా - నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్
5. అసుర్ 2 - జియో సినిమా వేదికగా స్ట్రీమింగ్
6. రానా నాయుడు - నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్
7. దహాద్ - అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్
8. సాస్, బహు ఔర్ ఫ్లెమింగో - డిస్ని ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్
9. స్కూప్ - సోనిలీవ్ వేదికగా స్ట్రీమింగ్
10. జూబ్లీ - అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్
ఈ పది సీరిసుల్లో వెంకటేష్, రానా నటించిన వెబ్ సిరీస్ ఒక్కటే తెలుగువారు నటించిన సిరీస్. ఇక అన్ని సిరీసులు ఆయా ఓటీటీల్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మీరు ఈ వెబ్ సిరీసులను చూడటం మిస్ అయితే.. ఎంచాక్క ఓటీటీల్లో చూసి ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











