OTT: ఏకంగా 3 ఓటీటీల్లో సూపర్ హిట్ అడ్వెంచర్ చిత్రం.. ఏ రోజు స్ట్రీమింగ్ అంటే?
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్టుల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక దిగ్గజం రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న SSMB29 చిత్రం. ఈ సినిమాను యాక్షన్ అండ్వెంచర్ తరహాలో తెరకెక్కిస్తున్నట్లు జక్కన్న చెప్పిన విషయం తెలిసిందే. SSMB29 స్ఫూర్తిగా, అడ్వెంచరస్ సినిమాలపై రాజమౌళికి ఆసక్తి పెరిగేలా చేసిన సినిమా ఫ్రాంచైజీ ఇండియానా జోన్స్ (Indiana Jones). ఈ సినిమా సిరీస్ నుంచి ఇటీవలే ఐదో సినిమాగా 'ఇండియానా జోన్స్ అండ్ డయల్ ఆఫ్ డెస్టినీ' (Indiana Jones and the Dial of Destiny) విడుదలైంది. తాజాగా దీనికి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
1981లో మొదలు:యాక్షన్ అండ్ అండ్వెంచరస్ సినిమాలకు కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ జోనర్లలో యావత్ ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన మూవీ ఫ్రాంఛైజి ఇండియానా జోన్స్ (Indiana Jones). ఈ మూవీ సిరీసుకు వరల్డ్ వైడ్ గా అభిమానులు ఉన్నారు. అందుకే రెగ్యులర్ సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. అలా 1981 సంవత్సరంలో మొదలైన ఈ ఫ్రాంఛైజీ జర్నీ నేటికి కొనసాగుతోంది. ఇప్పటికీ ఈ సిరీసులో ఐదు సినిమాలు వచ్చాయి.

ఐదో సినిమాకు మాత్రం:రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ (1981), ది టెంపుల్ ఆఫ్ డూమ్ (1984), ది లాస్ట్ క్రూసేడ్ (1989), ది కింగ్డమ్ ఆఫ్ ది క్రిస్టల్ స్కల్ (2008) చిత్రాలు రాగా.. ఇటీవలే ఐదో చిత్రంగా 'ఇండియానా జోన్స్ అండ్ డయల్ ఆఫ్ డెస్టినీ' (Indiana Jones 5) వచ్చింది. మొదటి నాలుగు చిత్రాలకు స్టీవెన్ స్పీల్ బర్గ్ దర్శకత్వం వహించగా.. ఐదో సినిమాను జేమ్స్ మాన్ గోల్డ్ డైరెక్ట్ చేశారు. జూన్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రశంసలు అందుకుంది. అయితే గత చిత్రాలతో పోలిస్తే తక్కువ కలెక్షన్స్ రాబట్టింది.
370 మిలియన్ డాలర్ల కలెక్షన్స్:370 మిలియిన్ డాలర్ల బడ్జెట్ తో నిర్మించిన ఇండియానా జోన్స్ 5 సినిమా 370 మిలియన్ డాలర్లు మాత్రమే రాబట్టి పర్వాలేదనిపించుకుంది. అయితే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. ఎట్టకేలకు ఇండియానా జోన్స్ అండ్ డయల్ ఆఫ్ డెస్టినీ ఓటీటీ (Indiana Jones and the Dial of Destiny OTT) డేట్ ఖరారు అయింది.

ఫ్రీగా స్ట్రీమింగ్:ఇండియానా జోన్స్ 5 సినిమాను (Indiana Jones 5 OTT) ఆగస్ట్ 29 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే మొదటగా వీడియో ఆన్ డిమాండ్ పద్ధతిలో అందుబాటులోకి రానుంది. అంటే ఈ మూవీ చూడాలంటే కొంత మొత్తంలో డబ్బు చెల్లించాల్సిందే. ఇవే కాకుండా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోను ఇండియానా జోన్స్ 5వ చిత్రాన్ని తీసుకొచ్చేందుకు సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇందులో ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. కానీ, అది ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారనే విషయంపై క్లారిటీ రాలేదు.

నటీనటులు:ఇదిలా ఉంటే ఇండియానా జోన్స్ అండ్ డయల్ ఆఫ్ డెస్టినీ సినిమాలో 80 ఏళ్ల హ్యారీసన్ ఫోర్డ్, ఫోబే వాలర్, మాడ్స్ కిక్కెల్సన్, ఆంటోనియో బండేరాస్, బాడీ హల్బ్రూక్, థామస్ క్రెచ్ మ్యాన్, కరెన్ అలెన్, మార్క్ కిలీన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వాల్డ్ డిస్నీ పిక్చర్స్, మోషనల్ పిక్చర్స్ బ్యానర్లపై జేమ్స్ మ్యాన్ గోల్డ్ దర్శకత్వం వహించగా.. జాన్ విలియమ్స్ మ్యూజిక్ అందించారు.


Click it and Unblock the Notifications











