ఓటీటీలో 13000 కోట్ల మూవీ సంచలనం.. రికార్డు వ్యూస్ సాధించిన ఈ సినిమా ఎక్కడ చూడొచ్చంటే?

అమెరికన్ యానిమేటెడ్ మూవీ ఇన్‌సైడ్ అవుట్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. 2024 సంవత్సరంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన హాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. వరల్డ్ బాక్సాఫీస్ వద్ద థియేట్రికల్ రిలీజ్ ముగించుకొన్న ఈ సినిమా ఓటీటీలో విశేషంగా ఆకట్టుకొంటున్నది. ఈ సినిమా ఓటీటీలో చేస్తున్న హంగామా విషయానికి వస్తే..

హాలీవుడ్ డైరెక్టర్ కెల్‌స్లే మాన్ దర్వకత్వంలో రూపొందిన మార్క్ నీల్సెన్ నిర్మాతగా రూపొందిన ఈ సినిమాకు అమీ పోచ్లెర్, మాయా హాకే, లిజా లపిరా, టోని హాలే తదితరులు తమ సహకారం అందించారు. క్వాలిటీ విషయంలోరాజీ పడకుండా వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్‌తో ఈ మూవీని సుమారుగా 300 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 2500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు.

Inside Out 2 is getting record level response OTT Here is Steaming platform Details

జూన్ 14వ తేదీన రిలీజైన ఈ చిత్రం నార్త్ అమెరికా, ఓవర్సీస్ మార్కెట్‌లో సంచలనాలు నమోదు చేసింది. వరల్డ్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రికార్డులను తిరగరాసింది. కేవలం 2 వారాల్లోనే ఈ చిత్రం 1 బిలియన్ డాలర్ల క్లబ్ చేరడం ఈ మధ్యకాలంలో ఓ సెన్సేషన్‌గా మారింది. అయితే అదే ఊపును కొనసాగిస్తూ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 13000 కోట్లు వసూలు చేసింది.

అయితే ఇటీవల ఈ మూవీ ఓటీటీలో గ్రాండ్‌గా వచ్చేసింది.ఈ చిత్రాన్ని ముందుగా పే చేసి చూసే విధంగా ఆప్షన్‌లో పెట్టారు. ఈ సినిమాకు ఉన్న ఫ్యాన్స్ ఓటీటీలోకి రాగానే డబ్బులు చెల్లించి చూశారు. ఆ తర్వాత తాజాగా ఈ సినిమాను ఉచితంగా చూసేందుకు వీలు కల్పించారు. దాంతో ఈ సినిమాను పిల్లలే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Inside Out 2 is getting record level response OTT Here is Steaming platform Details

పిల్లలు అమితంగా మెచ్చే యానిమేషన్ చిత్రంగా మెప్పుపొందిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ, వుడు లాంటి ఓటీటీలో పే పర్ వ్యూ ఆప్షన్‌లో స్ట్రీమింగ్ అయింది. అన్ని ఓటీటీల్లోను రికార్డు స్థాయి వ్యూస్ సాధించింది డిస్నీ హాట్ స్టార్ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీకి అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన వ్యక్తమవుతున్నది అని డిస్నీ హాట్ స్టార్ ఓ ప్రకటనలో తెలిపింది.

More from Filmibeat

Read more about: inside out 2 ott
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X