10 ఎపిసోడ్స్‌తో భారీ యాక్షన్, క్రైమ్ హారర్ వెబ్ సిరీస్..మార్చి 29న 240 దేశాల్లో గ్రాండ్ రిలీజ్

ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఓటీటీ ప్రభావం భారీగా పెరిగిన పోయిన తర్వాత కంటెంట్‌కు, క్వాలిటీతో కూడిన సినిమాలకు ప్రేక్షకులు పెద్ద పీట వేస్తున్నారు. ఆడియెన్స్ అభిరుచిని గ్రహించిన ఫిల్మ్ మేకర్స్ వారికి అంచనాలకు తగినట్టుగా మూవీస్ అందిస్తున్నారు. కంటెంట్‌తో రూపొందిన ఈ సినిమాలకు ఓటీటీలో అత్యంత ఆదరణ లభిస్తున్నది. అలాంటి కోవలనే వస్తున్న వెబ్ సిరీస్ ఇన్స్‌పెక్టర్ రిషి. క్రైమ్, హారర్ డ్రామాగా రూపొందిన సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్ే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సిరీస్ వివరాల్లోకి వెళితే..

ఇన్స్‌పెక్టర్ రిషి సిరీస్ విషయానికి వస్తే.. ఒరిజినల్‌గా తమిళంలో తెరకెక్కించారు. ఈ సినిమా కంటెంట్ తెలుగు భాష ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో తెలుగులోకి డబ్బింగ్ చేశారు. ఈ చిత్రం టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర, సునైనా, కన్నా రవి, మాలినీ జీవరత్నం, శ్రీకృష్ణ దయాళ్, కుమార వేల్ లాంటి ప్రతిభావంతులైన నటీనటులు నటించారు.

Inspector Rishi Web Series is set to Release in 240 Countries on March 29th in Amazaon Prime Video

భారీ యాక్షన్, క్రైమ్, డ్రామాతో రూపొందిన ఈ సిరీస్‌లో మొత్తంగా 10 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్‌ను అమెజాన్ ద్వారా మొత్తం 240కి పైగా దేశాల్లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. తెలుగు, తమిళం, ఇతర భాషల్లో రూపొందుతున్న ఈ సిరీస్ మార్చి 29వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది.

ఇన్స్‌పెక్టర్ రిషి వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను ఆవిష్కరించారు. తమిళనాడులోని ఓ గ్రామీణ ప్రాంతం నేపథ్యంగా తెరకెక్కించారు. ఇన్స్‌పెక్టర్, ఇద్దరు సబ్ ఇన్స్‌పెక్టర్స్ కలిసి అటవీ ప్రాంతంలో అంతుచిక్కని రహస్యాలను శోధించే ప్రయత్నం చేస్తుంటారు. కేసు దర్యాప్తులో వారికి ఎదురైన సవాళ్లు, సంఘటనలు ఏమిటి? అతీత శక్తులను ఎలా ఎదురించారు? చివరకు వారు తమ లక్ష్యాన్ని ఎలా చేరుకొన్నారనే విషయమే ఈ సిరీస్ కథగా అని చెబుతున్నారు.

Inspector Rishi Web Series is set to Release in 240 Countries on March 29th in Amazaon Prime Video

నవీన్ చంద్ర విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో హీరోగా, విలన్‌గా, ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలతో నటుడిగా ఆకట్టుకొంటున్నారు. నటుడిగా మరో మెట్టు ఎక్కడానికి, నన్ను నేనుగా నిరూపించుకోవడానికి చేసిన పాత్రనే రిషి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నాకు ఇది రెండో వెబ్ సిరీస్ అని నవీన్ చంద్ర తెలిపారు. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆలరిస్తుందని అన్నాడు. క్యాథి పాత్రలో నటించిన సునైనా మాట్లాడుతూ.. ఈ క్యారెక్టర్ నాకు మంచి పేరు తెచ్చిపెడుతుంది అని అన్నారు.

ఇదిలా ఉండగా, అమెజాన్ ప్రైమ్ వీడియో ఇటీవల ముంబైలో భారీగా మెగా ఈవెంట్‌ను నిర్వహించింది. ఈవెంట్‌కు సుమారుగా దేశంలోని సినీ ప్రముఖులే కాకుండా విదేశాల నుంచి కూడా సెలబ్రిటీలు వచ్చారు. దాదాపు 70 వెబ్ సిరీస్, మూవీలను రిలీజ్ చేస్తున్నట్టు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X