OTT MOVIES: ఓటీటీ ఆడియెన్స్ కు పండగే.. ఒకేసారి 19 సినిమాలు రిలీజ్!
ఓటీటీ ఫ్లాట్ ఫారామ్ అనేది ఇటీవల ఓ వర్గం ప్రేక్షకులకు ఎంతగానో దగ్గర అయిపోయింది. సినిమా ధియేటర్లలో సినిమాలకు ఎంత మంచి గుర్తింపు వస్తుందో అదే తరహాలో ఇప్పుడు ఓటీటీ మార్కెట్లో కూడా సినిమాలకు మంచి డిమాండ్ అయితే పెరుగుతోంది. ఇక ఈ వారం కూడా విభిన్నమైన సినిమాలు ఓటీటీ ప్రపంచంలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదలయ్యాయి. ఇక ఆదివారం లోపు మొత్తంగా ఈ వారం 19 సినిమాలు హడావిడి చేయబోతున్నాయి. ఇక ఏ సినిమా ఎందులో స్ట్రీమింగ్ కాబోతోంది.. అనే వివరాల్లోకి వెళితే..

ఎక్కువగా ఈ సినిమాపైనే ఫోకస్
మొదట అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాలలో అయితే కన్నడ సినిమా 777 చార్లీ టాప్ లిస్టులో ఉంటుంది. ఒక పెంపుడు డాగ్ ఆధారంగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంది. ఇక సెప్టెంబర్ 30న తమిళ్ తెలుగు మలయాళం హిందీలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబోతోంది. మొదట ఈ సినిమాను పే పర్ వ్యూ పద్ధతిలో విడుదల చేయబోతున్నారు.

కెప్టెన్ సినిమా
అలాగే ఇటీవల ఆర్య నటించిన ఏలియన్ మూవీ కెప్టెన్ మూవీ కూడా విడుదల కాబోతోంది. తమిళ్ తెలుగులో ఒకేసారి ఈ సినిమాను జి ఫైవ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అలాగే ఆహా వీడియోలో మరొక డిఫరెంట్ సినిమా రాబోతోంది. రెయికి వెయ్యి కళ్ళు అనే సినిమా సెప్టెంబర్ 30న కాబోతోంది.

ఆహా, హాట్ స్టార్
ఇక వివిధ భాషల్లో కొన్ని డిఫరెంట్ సినిమాలు కూడా సెప్టెంబర్ 30వ తేదీన స్ట్రీమింగ్ కాబోతున్నాయి. బ్యాడ్ కంపెనీ అనే వెబ్ సిరీస్ మొదటి సీజన్ ఆహా తమిళ్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక వాటితో పాటు హాట్ స్టార్ లో తీర్పు అనే ఒక సినిమా హకస్ ఫోకస్ 2 అనే మరో ఇంగ్లీష్ సినిమా, ఇక కర్మయుద్ధం అనే మరొక సినిమా కూడా హాట్ స్టార్ లోనే స్ట్రీమింగ్ కాబోతోంది.

నెట్ ఫ్లిక్స్ లో ఒకేసారి..
ఇక నెట్ ఫ్లిక్స్ లో అయితే గురువారం రోజు ఒకేసారి ఆరు విభిన్నమైన సినిమాలు వెబ్ సీరీస్ లు రాబోతున్నాయి. ప్లాన్ ఏ ప్లాన్ బి అనే హిందీ సినిమాతో పాటు రెయిన్ బో అనే ఒక స్పానిష్ మూవీ.. ఇంటర్గలక్టిక్ (ఇంగ్లీష్) అణికులపో, పంథొమ్ పప్స్, ఫ్లోర్ ఈజ్ లావా.మ్ అనే మరికొన్ని ఇంగ్లీష్ సినిమాలు విడుదల అవుతున్నాయి.
అలాగే నెట్ ఫ్లిక్స్ లోనే వైష్ణవ్ తేజ్ రంగరంగ వైభవంగా సినిమా కూడా ఆదివారం స్ట్రీమింగ్ కానుంది.

బుజ్జి ఇలా రా..
ప్రైమ్ వీడియోలో యార్ మారో (పంజాబీ) సినిమాతో పాటు బుజ్జి ఇలా రా అని తెలుగు సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇందులో సునీల్ ధన్ రాజ్ ప్రధాన పాత్రలో నటించారు. ఇక విక్రమ్ నటించిన కోబ్రా సినిమా సోని లీవ్ లో ఇప్పటికే విడుదలైంది. వీటితో పాటు తమిళ్ బెంగాలీకి సంబంధించిన మరికొన్ని సినిమాలు కూడా విడుదల కానున్నాయి. మరి ఈ సినిమాలు ఎలాంటి క్రేజ్ అందుకుంటాయో చూడాలి.


Click it and Unblock the Notifications











