Iravatham Disney+Hotstar ఆకట్టుకొంటున్న ఎస్తేర్ ఫెర్ఫార్మెన్స్.. ఓటీటీలో సత్తా చాటిన ఐరావతం

సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్‌తో తెరకెక్కిన ఐరావతం చిత్రం ఓటీటీలో సత్తా చాటుతున్నది. ఎస్తేర్ నోహ, అమర్ దీప్, తన్వీ నేగి, అరుణ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని రేఖ పలగాని సమర్పణలో రాంకీ పలగాని, బాలయ్య చౌదరి, లలిత కుమారి తోట నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించారు. నూజివీడు టాకీస్ అనే బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు సుహాస్ దర్శకత్వం వహించారు. జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్ దీప్, యువ హీరోయిన్ ఎస్తేర్ నోర్హా తదితరుల కీలకపాత్రలు పోషించిన ఈ మూవీ నవంబర్ 17వ తేదీ నుంచి డిస్నీ+హాట్ స్టార్ స్ట్రీమింగ్ అవుతున్నది.

ఐరావతం మూవీకి డిస్నీ+హాట్ స్టార్‌లో అనూహ్య స్పందన లభిస్తున్నది. ఈ నెల 17 నుంచి డిస్నీ+హాట్ స్టార్‌లో నంబర్ వన్ పొజిషన్‌లో స్ట్రీమింగ్ అవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఎస్తేర్ నొర్హానా, అమీర్ దీప్ పాత్రలకు మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. రెండు వేరియేషన్స్‌తో కనిపించే అరుణ్, ఎస్తేర్ పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నాయి. స్పస్పెన్స్, హారర్, థ్రిల్లింగ్ అంశాలకు మంచి రెస్పానస్ వస్తున్నది. వైట్ కెమెరా నేపథ్యంగా సాగే కథ మంచి ఎంగేజింగ్‌గా ఉంది అని అన్నారు.

Iravatham movie getting huge response in Disney+Hotstar

నిర్మాతలు రాంకీ పలగాని, బాలయ్య చౌదరి చల్లా, లలిత కుమారి తోట మాట్లాడుతూ... ఆటవిడుపుగా ఐరావతం కథను దర్శకుడు సుహాస్ చెబితే మాకు బాగా నచ్చింది. ఈ కథలోని స్క్రీన్ ప్లే నచ్చి మూవీ తీద్దాం అనుకున్నాం. ఈ మూవీ డిస్నీ+ హాట్‌స్టార్‌కు నచ్చి తీసుకోవడంతో హ్యాపీగా ఫీలయ్యాం. గత రెండు వారాలుగా టాప్ ప్లేస్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ... ఫ్యూజన్ జోనర్‌లో తీసిన ఐరావతం హాట్ స్టార్ ప్రేక్షకులకు నచ్చడం చాలా హ్యాపీ. నిర్మాతలకు థాంక్స్. టెక్నీషియన్స్ కు థాంక్స్ అని అన్నారు.

Iravatham movie getting huge response in Disney+Hotstar

నటీనటులు: అమర్ దీప్, తన్వి నేగి, ఎస్తేర్ నోర్హా, అరుణ్, సంజయ్ నాయర్ తదితరులు
నిర్మాతలు: రాంకీ పలగాని, బాలయ్య చౌదరి చల్లా, లలిత కుమారి తోట
డైరెక్షన్: సుహాస్ మీరా
సమర్పణ రేఖ పలగాని
సాంగ్స్ రికార్డింగ్: సత్య కశ్యప్
రీరికార్డింగ్: కార్తిక్ కొడగండ్ల
సాంగ్స్: పూర్ణాచారి
ఎడిటర్: సురేష్ దుర్గం
పీఆర్వో: మధు
డీటీఎస్ మిక్సింగ్: శ్యామ్
కెమెరా: ఆర్కే వెల్లేపు
ఓటీటీ రిలీజ్: 2022-11-17

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X