Bigg Boss Telugu 6 first week Elimination ఎలిమినేషన్‌లో ఊహించని ట్విస్టు.. డేంజర్ తప్పించుకొన్న సెలబ్రిటీ

బిగ్‌బాస్ తెలుగు 6 రియాలిటీ షో ఆసక్తికరంగా సాగుతున్నది. నిర్వాహకులు ప్రస్తుత సీజన్‌లో యువతీ, యువకులకు పెద్ద పీట వేయడంతో యూత్ ఓరియెంటెడ్‌గా బిగ్ బాస్ ముందుకెళ్తున్నది. టెలివిజన్ స్టార్స్, యూట్యూబ్ స్టార్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ మధ్య వివాదాలు, విభేదాలతో ఈ షో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. అయితే తొలి వారం నామినేషన్‌లో ఉన్న సెలబ్రిటీల ఎలిమినేషన్ ప్రక్రియను హోస్ట్ నాగార్జున శనివారం షూట్‌లో ముగించారు. ఈ వారం ఇంటి నుంచి ఎవరు వెళ్లిపోతున్నారనే విషయంలోకి వెళితే..

నామినేషన్‌లో ఉన్న సెలబ్రిటీలు

నామినేషన్‌లో ఉన్న సెలబ్రిటీలు

బిగ్‌బాస్ తెలుగు 6 ఇంటి నుంచి తొలి వారం బయటకు వెళ్లడానికి అవకాశం ఉన్న సభ్యుల్లో ఏడుగురు ఉన్నారు. సింగర్ రేవంత్, చలాకీ చంటీ, శ్రీ సత్య, జబర్దస్త్ ఫైమా, ఇనయా సుల్తాన్, కొరియోగ్రాఫర్ అభినయ శ్రీ, యాంకర్ అరోహిరావు‌ను నామినేట్ అయ్యారు. దాంతో ఇంటి నుంచి ఎవరు వెళ్లిపోతారనే విషయం ఆసక్తికరంగా మారింది.

 మారిన నిబంధనల ప్రకారం

మారిన నిబంధనల ప్రకారం

బిగ్‌బాస్ తెలుగు 6 రియాలిటీ షోలో కొత్తగా నిబంధనలు సడలించారు. గత సీజన్లలో సోమవారం నామినేషన్ ప్రక్రియ ఉండేది. ఆ రోజు నుంచే ఓటింగ్ జరిగేది. కానీ ఈ సీజన్ నుంచి నామినేషన్ ప్రక్రియను బుధవారం చేపట్టారు. గురు, శుక్రవారం మాత్రమే ఓటింగ్‌కు అవకాశం కల్పించారు.

సెలబ్రిటీలకు నమోదైన ఓటింగ్

సెలబ్రిటీలకు నమోదైన ఓటింగ్

గత రెండు రోజుల్లో నామినేషన్‌‌లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్లకు ఇలా ఓటింగ్ నమోదైంది. యాప్ ఓటింగ్‌లో
రేవంత్‌కు 35 శాతం
ఫైమాకు 25 శాతం
శ్రీ సత్యకు 16 శాతం
చంటీ చలాకీ 15 శాతం
అరోహి 8 శాతం
ఇనయా సుల్తానాకు 7 శాతం
అభినయ శ్రీ 6 శాతం ఓట్లు వచ్చాయి.

మిస్డ్ కాల్ డేటా ఆధారంగా ఎలిమినేషన్

మిస్డ్ కాల్ డేటా ఆధారంగా ఎలిమినేషన్

బిగ్‌బాస్ తెలుగు 6 ఎలిమినేషన్‌కు మిస్డ్ కాల్ డేటా కీలకంగా మారింది. సీక్రెట్‌గా ఉండే ఈ డేటా ద్వారానే కంటెస్టెంట్ ఎలిమినేషన్ నిర్ధారణ అవుతుంది. అలాగే చివరి మూడు స్థానాల్లో నిలిచిన కంటెస్టెంట్ల ప్రతిభ, ఇంటిలో వారి యాటిట్యూడ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎలిమినేషన్‌ను నిర్ణయిస్తారు. తొలి వారం ఎలిమినేషన్ రసవత్తరంగా సాగినట్టు సమాచారం.

బిగ్‌బాస్‌లో ఎలిమినేషన్‌లో ట్విస్టు ఇలా

బిగ్‌బాస్‌లో ఎలిమినేషన్‌లో ట్విస్టు ఇలా


సోషల్ మీడియా, యూట్యూబ్‌, ఇతర మీడియా సమాచారం ప్రకారం.. బిగ్‌బాస్ తెలుగు 6 ఇంటి నుంచి తొలి కంటెస్టెంట్‌గా అభినయ శ్రీ ఎలిమినేషన్ అయినట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ వారం ఎలిమినేషన్ లేకుండానే ఈ వారాన్ని ముగించినట్టు తెలిసింది. మూడు రోజుల్లో కంటెస్టెంట్ ప్రతిభను అంచనా వేయలేం. కాబట్టి ఈ వారం ఎలిమినేషన్ మినహాయించినట్టు సమాచారం. ఒకవేళ బిగ్‌బాస్ ట్విస్టు ఇస్తే.. అభినయశ్రీ ఎలిమినేషన్ తప్పదు అనే విషయం మీడియాలో ప్రచారం జరుగుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X