OTT: రికార్డు ధరకు హరిహర వీరమల్లు ఓటీటీ రైట్స్.. పవన్ కల్యాణ్ మూవీ ఏ ఓటీటీకి దక్కిందంటే?
దక్షిణాదిలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దిగ్గజ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు నిర్మించిన చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకొంటున్నది. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొన్నది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగిందనే వార్త తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనంగా మారింది. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
హరిహర వీరమల్లు కథ ఏమిటంటే?
హరిహర వీరమల్లు సినిమా కథ విషయానికి వస్తే.. చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్‌గా కనిపించబోతున్నారు. మొఘల్ రాజుల నుండి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే కథతో ప్రేక్షకుల మనసు దోచుకోనే ఓ వర్గం వీరుడి కథ. యాక్షన్, ఎమోషన్స్ కలిసి ఉన్న ఈ చిత్రంలో హై ఓల్డేజ్ ఫైట్స్‌తో పవన్ కల్యాణ్ తన అభిమానులను ఆకట్టుకొనేందుకు సిద్దమవుతున్నారు. అగ్ని లాంటి ఆవేశం, న్యాయం చేయాలనే ఆలోచన ఉన్న యోధుడిగా.. మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో పవర్ స్టార్ కనిపించనున్నారు. ఇది కేవలం కథ కాదు.. ఇది ఒక విప్లవం. న్యాయం కోసం యుద్ధం చేసే ధీరుడు వీరమల్లు పాత్ర తెలుగు సినిమా పరిశ్రమలో చిరకాలం నిలిచే పాత్రగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

మొఘల్ చక్రవర్తిగా ఎవరంటే?
హరిహర వీరమల్లు సినిమాలో మొఘల్ చక్రవర్తిగా బాబీ డియోల్ నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో నిధి అగర్వాల్, సత్యరాజ్, జిషు సేన్ గుప్తా తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు ఈ సినిమాకు కీరవాణి సంగీతం, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫి, లెజెండరీ కళాదర్శకుడు తోట తరణి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
రిలీజ్ వాయిదా ఎందుకంటే?
హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికే ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ పవన్ కల్యాణ్ రాజకీయ, వ్యక్తిగత కారణాల వల్ల ఆలస్యమైంది. ఈ సినిమా రిలీజ్ డేట్ పలుమార్లు వాయిదా పడింది. షూటింగు అనివార్య కారణాల వల్ల జరగకపోవడం వల్ల రిలీజ్ ఆగిపోయింది. అయితే ఇటీవల తన ప్రొఫెషనల్ పనులన్నీ పక్కన పెట్టి ఈ సినిమా షూటింగ్‌ను పవన్ కల్యాణ్ పూర్తి చేశారు. దాంతో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఊపందుకొన్నాయి. పలు దేశాల్లో ఈ సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్ యుద్ద ప్రాతిపాదికన జరుగుతున్నాయి.
హరిహర వీరమల్లు ఓటీటీ రైట్స్
అయితే పవన్ కల్యాణ్ నటించిన ఈ సినిమా బిజినెస్ కార్యక్రమాలు ఊపందుకొంటున్నాయి. ఓటీటీ, శాటిలైట్‌తోపాటు థియేట్రికల్ బిజినెస్ వ్యవహారాలు మొదలయ్యాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ కోసం భారీ పోటీ ఏర్పడింది. ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీ పడ్డాయి. చివరకు ఫ్యాన్సీ రేటును, రికార్డు మొత్తాన్ని చెల్లించి ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో చేజిక్కించుకొన్నట్టు ఓ వార్త ఫిలింనగర్‌లో ప్రచారంలో ఉంది. ఎన్ని కోట్ల రూపాయలకు ఈ రైట్స్ అమ్ముడుపోయాయనే విషయం గురించి ఆధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
ఇదిలా ఉండగా, అధికార ప్రకటన ప్రకారం హరిహర వీరమల్లు సినిమా మే 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఈ సినిమా ప్రొడక్షన్ పనులు, ఇతర అంశాలకు సమయం లేకపోవడం వల్ల ఈ మూవీ రిలీజ్ అవుతుందా? లేదా అనే విషయంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ సినిమా మరోసారి వాయిదా పడుతుందా? మే 30 తేదీనే వస్తుందా? అనేది ఆసక్తిగా మారింది. అయితే జూన్ 13వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుందనే ప్రచారం తెర మీదకు వచ్చింది.


Click it and Unblock the Notifications











