ప్రముఖ ఓటీటీతో కియారా అద్వానీ భారీ ఒప్పందం.. వెడ్డింగ్ స్ట్రీమింగ్ రైట్స్ డీల్ ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ తారలు సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ వివాహం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు సమీపంలోని సూర్యగఢ్ ప్యాలేస్‌లో ఫిబ్రవరి 7వ తేదీన వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. కొద్ది సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్న స్టార్ హీరో, హీరోయిన్.. పెద్దల అంగీకారంతో దంపతులుగా మారిపోయారు.
అయితే ఈ వివాహాన్ని ప్రైవేట్ కార్యక్రమంగా మలచడం వెనుక ఓటీటీతో భారీ డీల్ ఉందనే విషయం మీడియాలో షికారు చేస్తున్నది. అంతేకాకుండా కియారా, సిద్దార్థ్ పెళ్లికి సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను స్ట్రీమింగ్ చేయడానికి ప్రముఖ ఓటీటీ సంస్థతో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకొన్నారనే వార్త హల్‌చల్ చేస్తున్నది. ఆ ఓటీటీ ఒప్పందం వివరాల్లోకి వెళితే..

ఢిల్లీలో ఫ్యామిలీ రిసెప్షన్
ఫిబ్రవరి 7వ తేదీన తర్వాత జైసల్మేర్‌లోని సూర్యాగఢ్ ప్యాలెస్‌లో వివాహం జరిగిన తర్వాత కియారా, సిద్దార్థ్ ఢిల్లీకి చేరుకొన్నారు. ఢిల్లీలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతో విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే మీడియాను గానీ, ఫోటోగ్రాఫర్లను గానీ అనుమతించబోమని ఇద్దరి మేనేజర్లు సమాచారం పంపినట్టు సమాచారం.

కెమెరాలకు ముఖం చాటేసిన కియారా
ఢిల్లీకి చేరుకొన్న కియారా, సిద్దార్థ్ తమ ఇంటి వద్దకు వచ్చిన మీడియాను కలుసుకొన్నారు. వారికి స్వీట్ బాక్సులు ఇచ్చి తమ సంతోషాన్ని పంచుకొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు కెమెరాకు ఫోజు ఇవ్వాలని కోరితే.. అందుకు నిరాకరించారు. కెమెరాలకు ముఖం చూపించడానికి కియారా, సిద్దార్థ్ నిరాకరించారు.
అడ్డదారిలో రిసెప్షన్‌కు సిద్దార్థ్ దంపతులు
ఢిల్లీలో జరిగిన రిసెప్షన్ కోసం కియారా, సిద్దార్థ్ ఇద్దరు చాలా జాగ్రత్తలు తీసుకొన్నారు. మీడియా వారికి కంటపడకుండా వెనుక గేట్ నుంచి రిసెప్షన్ హాల్‌లోకి ప్రవేశించారు. దాంతో వారిని కెమెరాలో బంధించాలనుకొన్న ఫోటోగ్రాఫర్లకు నిరాశ ఎదురైంది. అయితే మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం అసంతృప్తికి గురిచేసింది.

అమెజాన్ ప్రైమ్ వీడియోతో భారీ ఒప్పందం
అయితే సిద్దార్థ్, కియారా అద్వానీ తమ పెళ్లికి సంబంధించిన వీడియో కంటెంట్‌ను ఇచ్చేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోతో ఒప్పందం కుదుర్చుకొన్నట్టు సమాచారం. కియారా దంపతులతో భారీ ఒప్పందాన్ని అమెజాన్ చేసుకొన్నట్టు మీడియాలో ఓ వార్త ప్రచారం జరుగుతున్నది. అయితే ఏ మేరకు, ఎంత మొత్తానికి ఒప్పందం జరిగిందనే విషయాన్ని గుట్టుగా ఉంచారు.

అమెజాన్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇదిలా ఉండగా కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లికి సంబంధించిన ఫోటోను అమెజాన్ ప్రైమ్ వీడియో షేర్ చేసింది. దాంతో వారి మధ్య ఒప్పందం జరిగిందనే విషయానికి మరింత బలం చేకూరిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే కియారా, సిద్దార్థ్ పెళ్లి తంతును ఓటీటీలో అమెజాన్ ఎప్పుడు ప్రసారం చేస్తుందనే విషయం ఆసక్తిగా మారింది.


Click it and Unblock the Notifications











