'జూ ఎన్టీఆర్ ప్రస్తావన తేవొద్దు.. బాలకృష్ణ హుకుం జారీ చేశాడా?'
నందమూరి కుటుంబంలో తాత ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణల తర్వాత బాబాయ్ బాలకృష్ణను ఎక్కువగా అభిమానిస్తారు జూనియర్ ఎన్టీఆర్. తాను హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో స్టేజ్‌పై బాబాయ్‌ని చూడగానే చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చాడు జూనియర్. బాబాయ్ ప్రేమానురాగాల కోసం జూనియర్ ఎన్టీఆర్ ఎంతగానో తపించిపోయారని ఈ ఘటనను బట్టి అర్ధం చేసుకోవచ్చు. అలాంటిది బాబాయ్ - అబ్బాయ్ మధ్య ప్రస్తుతం రిలేషన్స్ సరిగా లేవంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు.
ఎన్టీఆర్ - బాలయ్య మధ్య సంబంధాలు దెబ్బతినడానికి చాలా కారణాలు ఉన్నాయని అంటూ ఉంటారు విశ్లేషకులు . 2009 ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాతి నుంచి టీడీపీకి ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో బాలయ్యతోనూ గ్యాప్ వచ్చిందని చెబుతుంటారు. కానీ 2018లో ఎన్టీఆర్ బయోపిక్ సమయంలో బాబాయ్ - అబ్బాయ్‌లు ఒకే స్టేజ్‌పై సందడి చేసి గాసిప్స్‌కు చెక్ పెట్టారు.

అయితే తన మేనత్త నారా భువనేశ్వరిని ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు అవమానిస్తే , ఎన్టీఆర్ సరిగా స్పందించకపోవడం బాలయ్యకు ఆగ్రహం తెప్పించదని కూడా చెబుతుంటారు. టీడీపీకి చావోరేవో వంటి 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జూనియర్ కనీసం మాట మాత్రంగానైనా సపోర్ట్ చేయకపోవడం కూడా తెలుగుదేశం వర్గాలను , బాలయ్యను బాగా డిజప్పాయింట్ చేసిందట. బాలయ్యతో వేదిక పంచుకునే అవకాశం వచ్చినా ఎన్టీఆర్ దానిని స్కిప్ చేయడం ఎప్పుడూ చర్చనీయాంశమవుతోంది. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు, బాలయ్య 50 ఇయర్స్ సెలబ్రేషన్స్‌కు ఎన్టీఆర్ డుమ్మా కొట్టడం సినీ , రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
కాగా.. బాలకృష్ణ హోస్ట్‌గా తెలుగు ఓటీటీ సంస్ధ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 3 సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుని నాలుగో సీజన్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సెలబ్రెటీలను బాలయ్య తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తూ ఆహాకు సబ్‌స్క్రైబర్లను పెంచారు. వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, ప్రభాస్ , అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్స్ ఈ మెగా టాక్ షోకు హాజరయ్యారు. కానీ నాలుగు సీజన్లు గడుస్తున్నా జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడంపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి.
బాలయ్య - జూనియర్ ఎన్టీఆర్ రిలేషన్‌షిప్, అన్‌స్టాపబుల్‌కు తారక్ హాజరుకాకపోవడంపై ఇన్‌డైరెక్ట్ వ్యాఖ్యలు చేశారు డైరెక్టర్ బాబీ. బాలకృష్ణ లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ వివరాలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో అన్‌స్టాపబుల్ షోలో ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావొద్దు అన్నారని బాలకృష్ణ మీకు హుకుం జారీ చేశారని బాబీని విలేకరులు ప్రశ్నిస్తారు. దీనికి బాబీ స్పందిస్తూ అంత డ్రామా జరగలేదని.. స్క్రీన్‌పై స్లైడ్ అయిన ఫోటోల గురించే అడిగారని వాటికి మాత్రమేనే నేను ఆన్సర్ ఇచ్చానని తేల్చేశారు బాబీ.

షో మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు కొన్ని సినిమాలు, క్యారెక్టర్ల ప్రస్తావన వచ్చినప్పుడు వాటికి తారక్ అయితే బాగా సెట్ అవుతారని బాలయ్య నాతో, వంశీగారితో అన్నారని తెలిపారు. ఎన్టీఆర్ నటించిన జైలవకుశ సినిమా బాలయ్యకి చాలా ఇష్టమని , దాని గురించి పలుమార్లు నా దగ్గర ప్రస్తావించారని .. చిన్న విషయాన్ని పెద్దది చేయొద్దని బాబీ కోరారు.


Click it and Unblock the Notifications











