Bigg Boss Telugu 6 Elimination ఛీటింగ్ చేయబోయిన కంటెస్టెంట్ అవుట్.. హిస్టరీలో బిగ్‌బాస్ సంచలన నిర్ణయం
బిగ్‌బాస్ తెలుగు 6 రియాలిటీ షో మూడో వారం ఎలిమినేషన్‌కు సిద్దమైంది. గతవారం ఇంటిలో కెప్టెన్సీ టాస్క్‌లో ఆటగాళ్ల టాలెంట్ ఓటింగ్ ప్రక్రియపై ప్రభావం చూపడంతో కొందరు కంటెస్టెంట్ల తలరాతలు తారుమారయ్యాయి. అయితే ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఆసక్తికరంగా ఊహించని కంటెస్టెంట్ ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆ కంటెస్టెంట్ ఎవరంటే?

రెండో వారంలో ఇద్దరు ఎలిమినేషన్
గతవారం ఎవరూ ఊహించని విధంగా ఇంటి నుంచి ఇద్దరిని ఎలిమినేట్ చేశారు. డబుల్ ఎలిమినేషన్ స్ట్రోక్‌తో షానీ సల్మాన్, అభినయశ్రీని ఇంటి నుంచి బయటకు పంపించారు. దాంతో ఇంటి సభ్యులకు డైరెక్ట్‌గా బిగ్‌బాస్ షాక్ ఇచ్చారు.

మూడో వారం నామినేషన్ లిస్టు
ఇక బిగ్‌బాస్ ఇంటిలో మూడో వారం నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అవకాశం ఉన్న సభ్యులు తొమ్మిది మందిని ఫైనల్ చేశారు. నామినేషన్ జాబితాలో ఉన్నవారిలో వసంతి, బాలాదిత్య, చలాకీ చంటి, ఆరోహి రావు, నేహా చౌదరీ, ఇనయ సుల్తానా, శ్రీహాన్, రేవంత్, గీతూ రాయల్ ఉన్నారు.

గేమ్ ఛేంజర్‌గా కెప్టెన్సీ టాస్క్
ఇక ఇంటిలో కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా కంటెస్టెంట్లు తమ వ్యూహాలకు పదునుపెట్టడం, గేమ్‌ను తమవైపుకు తిప్పుకొని ప్రేక్షకుల ఓట్లను సానుకూలంగా మార్చుకొన్నారు. దాంతో అరోహిరావు లాంటి వాళ్లు ఎలిమినేషన్ వేటు నుంచి తప్పించుకొన్నారు. ఇంకా కొందరు సేఫ్ జోన్‌లోకి వెళ్లారు.

శనివారం ట్విస్ట్ ఇచ్చిన హోస్ట్
ఇక శనివారం హెస్ట్ నాగార్జున వేదికపైకి వచ్చి ఇంటి సభ్యుల టాలెంట్, ఫెర్ఫార్మెన్స్‌పై రివ్యూ చేశారు. సరిగా ఆడని కంటెస్టెంట్లకు రేటింగ్ తక్కువగా ఇచ్చి.. వారికి సోఫ్ వెనుకకు పంపించి పనిష్‌మెంట్ ఇచ్చారు. అయితే ప్రతీవారం చేపట్టే ఎలిమినేషన్ ప్రక్రియను కూడా వాయిదా వేశారు. దాంతో ఎవరు సేఫ్ అవుతారు.. ఎవరు ఎలిమినేట్ అవుతారనే ట్విస్టును ఆదివారం వరకు కొనసాగించారు.

నేహా చౌదరీ ఎలిమినేషన్
ఇక తాజా సమాచారం ప్రకారం.. మూడో వారం ఇంటి నుంచి నేహా చౌదరీ బయటకు పంపించినట్టు సమాచారం. కెప్టెన్సీ టాస్క్‌లో తనను చెంప దెబ్బ కొట్టాడని తప్పుడు ఆరోపణలు చేసి.. ఇరుకున పడిన నేహా చౌదరీ.. ప్రేక్షకుల నుంచి భారీ ఓట్లు సంపాదించలేకపోయింది. దాంతో మూడోవారం ఇంటి నుంచి బయటకు వెళ్లడం జరిగిందని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.

హోస్ట్ ఇద్దరిని నామినేట్ చేసి సంచలనం
ఇక బిగ్‌బాస్‌లో ఎన్నడూ జరుగని విధంగా సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ఇప్పటి వరకు నామినేషన్ ప్రక్రియను కేవలం కంటెస్టెంట్లు తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి బిగ్‌బాస్ చరిత్రలో హోస్ట్ ఇంటి సభ్యులను నామినేట్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఓ రికార్డుగా మారింది. ఆట తీరును మెరుగుపరుచుకోలేని కార్తీకదీపం ఫేమ్ కీర్తి భట్‌ను, అర్జున్ కల్యాణ్‌ను హోస్ట్ నాగార్జున నామినేట్ చేస్తూ సంచలనం నమోదు చేశారు.


Click it and Unblock the Notifications











