OTT: SSMB29 కోసం భారీ ఓటిటి సంస్థ రంగం లోకి.. పెద్ద ప్లాన్ తోనే వస్తున్న జక్కన్న
రాబోయే రోజుల్లో కేవలం ఇండియన్ బాక్సాఫీస్ నుంచి ఒక్క రోజులోనే 500 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టగలిగే సత్తా ఏదన్నా సినిమాకి ఉందా అనే ప్రశ్నకి ఖచ్చితంగా నిలిచే సమాధానపు కాంబినేషన్ ఏదన్నా ఉంది అంటే అది నిర్మొహమాటంగా ఎస్ ఎస్ రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుల కాంబినేషన్ అని చెప్పవచ్చు. గ్లోబల్ గా రాజమౌళికి ఉన్న ఫేమ్ అందుకు తగ్గట్టుగా మహేష్ బాబుకి ఉన్న సాలిడ్ కటౌట్ తో ఈ మార్క్ ని ఈజీగా తీసుకొస్తారని చెప్పవచ్చు.
ఇక రాజమౌళి సినిమాల ప్లానింగ్ లు ఎంత గ్రాండ్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలానే మహేష్ బాబుతో భారీ స్థాయి చిత్రాన్ని ప్రపంచ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్టుగా ఈ సినిమాపై కూడా పలు రూమర్స్ ఉన్నాయి. కాగా ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఎన్నో ఏళ్ళు కితం రాజమౌళి అనుకోని ఆపేసిన బిగ్ ప్రాజెక్ట్ "గరుడ" అంటూ కూడా రూమర్స్ ఉన్నాయి.

కాగా ఇలా ప్రతీ చిన్న అంశం కూడా ఈ సినిమాపై భారీ ఎలిమెంట్ గా మారుతూ వస్తుంది. అయితే ఇండియన్ సినిమా దగ్గర చాలా చిత్రాలు అత్యధిక బడ్జెట్ లో తెరకెక్కాయి కానీ ఏ సినిమా కూడా 1000 కోట్ల బడ్జెట్ మార్క్ ని అందుకోలేదు. కానీ ఆ మార్క్ ని అందుకోబోతున్న మొట్ట మొదటి తెలుగు సినిమా అలాగే భారతీయ సినిమా కూడా ఇదే అంటూ టాక్ ఉంది.
కాగా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కే ఎల్ నారాయణ భారీ బడ్జెట్ ని కేటాయించి పెడుతున్నారని టాక్. కాగా ఇప్పుడు వీరికి మరో బిగ్గెస్ట్ ఎడిషన్ ఏమిటంటే వరల్డ్ లోనే మంచి పాపులర్ అయ్యినటువంటి దిగ్గజ ఓటిటి సంస్థ కూడా ఈ సినిమాకి నిర్మాణంలో భాగం కాబోతున్నట్టుగా సినీ వర్గాల్లో పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఆ ఓటిటి సంస్థ మరేదో కూడా కాదు రాజమౌళి విషయంలో మొదటి నుంచీ మంచి ఆసక్తి కనబరుస్తున్న సంస్థ నెట్ ఫ్లిక్స్ వారే అట.

ప్రస్తుతానికి మహేష్ బాబుతో సినిమాకి వీరు కూడా ప్రొడక్షన్ లో భాగం అవుతామని ఓటిటి డీల్ కూడా తమకే ఇస్తే ప్రొడక్షన్ లో హెల్ప్ ఫుల్ గా ఉత్తమని ప్రపోజల్ పెట్టినట్టుగా తెలుస్తుంది. దీనితో నిర్మాతపై కూడా ఎలాగో భారీ తగ్గుతుంది కాబట్టి ఈ ప్రపోజల్ కి మేకర్స్ ఓకే చెప్తారో లేదో అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ వారు రాజమౌళి తెరకెక్కించిన గ్లోబల్ ఫినామినా ఆర్ ఆర్ ఆర్ తో భారీ లాభాలు అలాగే రీచ్ ని కూడా పొందారు.
దీనితో ఏ దర్శకుడుకి చేయని విధంగా స్పెషల్ డాక్యుమెంటరీని కూడా రాజమౌళి పై నెట్ ఫ్లిక్స్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇందుకోసం ఏకంగా హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ లాంటి డైరెక్టర్ తో కూడా బైట్ చెప్పించారు అంటేనే అర్ధం చేసుకోవచ్చు రాజమౌళి విషయంలో వారు ఎంత సీరియస్ గా ఉన్నారు అనేది. మరి చూడాలి ఈ సెన్సేషనల్ కలయిక ఏమవుతుంది అనేది.


Click it and Unblock the Notifications











