Unstoppable 2 లో పవన్ కల్యాణ్.. బాలయ్యతో టాక్ షోకు పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్.. ఎపిసోడ్ ఎప్పుడంటే?
ఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా స్ట్రీమింగ్ అవుతున్న టాప్ టాక్ షో Unstoppable 2 సీజన్ 2 ఘనంగా ప్రారంభమైంది. తొలి ఎపిసోడ్‌తోనే రెండో సీజన్ ఎలా ఉంటుందో రుచి చూపించాడు. తొలి ఎపిసోడ్ ట్రెండింగ్‌లో ఉండగానే.. రెండో ఎపిసోడ్‌తో టాక్ షోపై క్రేజ్ పెంచారు. తాజాగా రాబోతున్న రెండో ఎపిసోడ్‌లో పవన్ కల్యాణ్ రావడంపై హింట్ ఇచ్చారు. ఈ క్రేజీ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఫస్ట్ ఎపిసోడ్‌తో రాజకీయ ప్రకంపనలు
Unstoppable 2 సీజన్ తొలి ఎపిసోడ్‌ను బాలకృష్ణ గ్రాండ్‌గా మొదలుపెట్టాడు. చంద్రబాబు, లోకేష్‌తో ప్రారంభించిన ఎపిసోడ్ భారీ రెస్పాన్స్ లభించింది. ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ కాగానే రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. దాంతో తొలి ఎపిసోడ్‌పై భారీ అంచనాలు పెరిగాయి. అంచనాలను అందుకోవడంలో ఎపిసోడ్‌లో కంటెంట్ కీలక పాత్ర పోషించిందనే విషయాన్ని సినీ, రాజకీయ వర్గాలు ధృవీకరించాయి.

బాలకృష్ణ హడావిడితో
ఇక రెండో ఎపిసోడ్‌లో విశ్వక్ సేన్, సిద్దూ జొన్నలగడ్డ, నిర్మాత నాగవంశీతో బాలకృష్ణ చేసిన హడావిడి మరింత క్రేజ్ పెంచింది. ఈ ప్రోమోతో మరోసారి నెటిజన్లు, ఓటీటీ అభిమానుల దృష్టిని విశేషంగా ఆకర్షించారు. యువకులతో బాలయ్య చేసిన హంగామా చూసి.. శుక్రవారం స్ట్రీమింగ్ అయ్యే ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

నిర్మాత నాగవంశీతో బాలయ్య
Unstoppable 2 సెకండ్ ఎపిసోడ్ ప్రోమోలో నిర్మాత నాగవంశీతో బాలయ్య మాట్లాడుతూ.. త్రివిక్రమ్ బయట సినిమాలు చేయనివ్వవా? అని అడిగితే.. ఆయన బయట సినిమాలు చేయడం మాకు ఇష్టం లేదు అని నాగవంశీ చెప్పారు. ప్రస్తుతం నాగవంశీకి సంబంధించిన హారిక హాసిని, సితారా బ్యానర్లలో త్రివిక్రమ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగీత తెలిసిందే. ఈ బ్యానర్ నుంచి వచ్చే పలు సినిమాల్లో నిర్మాణ భాగస్వామ్యం పంచుకోవడం ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది.

త్రివిక్రమ్‌కు బాలకృష్ణ ఫోన్
ఇక త్రివిక్రమ్‌తో బాలకృష్ణ మాట్లాడుతూ.. నమస్తే త్రివిక్రమ్.. నేను బాలకృష్ణ మాట్లాడుతున్నాను.. ఇంతకు మీరు Unstoppable 2 టాక్ షోకు ఎప్పుడు వస్తున్నారు అంటూ ప్రశ్నిస్తే.. మీరు చెబితే.. ఇప్పుడంటే.. ఇప్పుడే వస్తాను అని త్రివిక్రమ్ జవాబిచ్చాడు. అయితే మీరు ఎవరితో రావాలో తెలుసా? అని బాలయ్య అడిగితే.. త్రివిక్రమ్ నవ్వుతూ తెలుసు అని సమాధానం ఇచ్చాడు.

చివరి ఎపిసోడ్‌లో పవర్ స్టార్
ఇదిలా ఉండగా, Unstoppable 2 సీజన్‌లో పవన్ కల్యాణ్ పాల్గొనే ఎపిసోడ్ ఇప్పటికే ఖరారైందని ఆహా వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే పవన్ పాల్గొనే ఎపిసోడ్ ఈ సీజన్ ముగిస్తుంది. Unstoppable 2 సీజన్ పవర్ స్టార్, త్రివిక్రమ్ పాల్గొనే పవర్ ఎపిసోడ్స్‌తో ముగుస్తుంది అనే విషయం సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ ఎపిసోడ్‌కు ఎప్పుడు వచ్చే విషయంపై ఇంకా క్లారిటీ పవన్ నుంచి రాలేదనే మరో వార్త మీడియాలో ప్రచారం జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











