Aryan Khan డైరెక్టర్‌గా షారుక్ ఖాన్ కొడుకు.. వెబ్ సిరీస్ టైటిల్ ఏమిటి? ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ త్వరలోనే గ్లామర్ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాడు. అయితే ఆర్యన్ నటుడిగా కాకుండా డైరెక్టర్‌గా సినీ రంగ ప్రవేశం చేయబోతున్నారు. ఓ వెబ్ సీరిస్‌ను రూపొందించడం కోసం స్క్రిప్టును కూడా పూర్తి చేశాడనే విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వెబ్ సిరీస్ కోసం సిద్దం చేసిన టైటిల్‌, సాంకేతిక నిపుణులు వివరాల్లోకి వెళితే..

స్టార్‌డమ్ అనే వెబ్ సిరీస్‌తో: గతేడాది సోషల్ మీడియా ద్వారా తన ప్రాజెక్టు వివరాలను షేర్ చేశాడు. తాను స్క్రిప్టు రాస్తున్నట్టు వివరాలు తెలియజేశాడు. కానీ ఆ ప్రాజెక్టు ఎలా ఉండబోతుందనే విషయాన్ని సస్పెన్స్‌గా పెట్టారు. అయితే ఆర్యన్ రాస్తున్న స్క్రిప్టు సినిమా రంగంపైనే ఉంటుంది. అతని వెబ్ సిరిస్ పేరు స్టార్‌డమ్ అని పేరు పెట్టారు అని సినీ వర్గాలు వెల్లడించాయి.

Is Shah Rukh Khan Son Aryan Khan to direct Web Series for Netflix?

నెట్‌ఫ్లిక్స్ కోసం ఆర్యన్ ఖాన్: అయితే ఆర్యన్ ఖాన్ తీయబోయే వెబ్ సిరీస్‌ కోసం నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్ చేయనున్నది. ఈ మేరకు వారిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్‌ శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ వెబ్ సిరీస్ 6 ఎపిసోడ్స్ ఉంటుంది అని తెలిపారు. ఈ వెబ్ సిరీస్ కోసం ఇండస్ట్రీలోని చాలా మంది రైటర్లు వర్క్ చేస్తున్నారు అని తెలిపారు.

Is Shah Rukh Khan Son Aryan Khan to direct Web Series for Netflix?

నిర్మాతగా షారుక్ ఖాన్ బ్యానర్: ఆర్యన్ ఖాన్ రూపొందిస్తున్న స్టార్ డమ్ వెబ్ సిరీస్‌ను రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నది. ఈ వెబ్ సిరీస్ కోసం ఫౌడా రైటర్ లయర్ రాజ్ స్క్రిప్టు కోసం వర్క్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టు వర్క్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ఏడాది చివర్లో స్క్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఈ వెబ్ సిరీస్ కోసం ఫిల్మ్ మేకింగ్‌ను నేర్చుకొన్నాడు అని సినీ వర్గాలు వెల్లడించాయి.

Is Shah Rukh Khan Son Aryan Khan to direct Web Series for Netflix?

రైటర్ కావాలనుకొని డైరెక్టర్‌గా: షారుక్ ఖాన్ తన కుమారుడిని హీరోగా చూడాలనుకొంటే.. ఆర్యన్ మాత్రం డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నాడు. ఆయన తొలుత సినీ రైటర్ కావాలనుకొన్నాడు.అయితే ప్రస్తుతం డైరెక్టర్ కావాలని రెడీ అవుతున్నాడు. అయితే డైరెక్టర్ నుంచి యాక్టర్‌గా మారుతారా? అని షారుక్ ఖాన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Is Shah Rukh Khan Son Aryan Khan to direct Web Series for Netflix?

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి..: ఆర్యన్ ఖాన్ విషయానికి వస్తే. గతేడాది డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం సంచలనం రేపింది. ముంబై నుంచి గోవాకు వెళ్లే క్రూయిజ్‌లో డ్రగ్స్‌తో ఉండటంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అరెస్ట్ చేసింది. చాలా రోజులపాటు ముంబై జైల్లో ఉన్నారు. షారుక్ దంపతులు చేసిన ప్రయత్నాలతో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ లభించింది. ఆ ఘటనతో ఆర్యన్‌కు మరింత పాపులారిటీ వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X