Siri Hanmanth అడల్ట్ వెబ్ సిరీస్‌లో బిగ్‌బాస్ భామ.. మరో హాట్ హీరోయిన్‌తో కలిసి...

బుల్లితెర మీద అందాల ఆరబోతకు వెనుకాడని సిరి హన్మంతు, రేష్మా పసుపులేటి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. బిగ్‌బాస్ రియాలిటీ షోలో అడుగు పెట్టిన తర్వాత ఈ ఇద్దరు ముద్దు గుమ్మలు మంచి పాపులారిటీ సంపాదించుకొన్నారు. గతంలో వెబ్ సిరీస్‌లో కనిపించిన ఈ అందాల బొమ్మలు మరోసారి వెబ్ సిరీస్ ద్వారా అభిమానులకు వేడి పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇద్దరు అందాల భామల గురించి, తాజా వెబ్ సిరీస్ విషయానికి వస్తే..

సిరి హన్మంతుకు భారీ క్రేజ్,

సిరి హన్మంతుకు భారీ క్రేజ్,


బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో ద్వారా సిరి హన్మంతు భారీ క్రేజ్, ఫాలోయింగ్‌ను సంపాదించుకొన్నది. బిగ్‌బాస్‌లో షణ్ముఖ్‌తో కలిసి రొమాన్స్‌తో మీడియా హెడ్‌లైన్స్‌ను ఆకర్షించింది. బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత తన ప్రియుడితో బ్రేకప్ కావడం మరింత హాట్‌గా మారింది. సోషల్, మీడియా మీడియా పతాక శీర్షికలను ఆకర్షించింది.

బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో

బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో


బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలతో గత కొద్దికాలంగా సిరి హన్మంతు మీడియాకు దూరంగా ఉంది. ఇటీవల బిగ్‌బాస్ నాన్‌స్టాప్ వేదికపై నాగార్జున సరసన మెరిసింది. ఇప్పుడిప్పుడే కెరీర్‌ గ్రాఫ్‌ను పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నది. అయితే ఓ క్రేజీ వెబ్ సిరీస్‌లో నటించేందుకు సిద్దమైందనే వార్త ఇప్పుడు మీడియా సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

హిందీలో అడల్టింగ్‌ వెబ్ సిరీస్‌ రీమేక్‌లో

హిందీలో అడల్టింగ్‌ వెబ్ సిరీస్‌ రీమేక్‌లో

హిందీలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్న అడల్టింగ్ అనే వెబ్ సిరీస్‌ను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనల్లో ఉన్నారు. ఈ చిత్రంలో అయేషా ఆహ్మద్, యశష్మిని దయానా, విరాజ్ గెహ్లానీ తదితరులు టనించారు. అయితే ఈ వెబ్ సిరీస్ గురించి అధికారికంగా ఓ ప్రకటన వెలువడనున్నది.

అడల్టింగ్ కథ ఏమిటంటే?

అడల్టింగ్ కథ ఏమిటంటే?

అడల్టింగ్ వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. ఇద్దరు మహిళల జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. స్వతంత్ర భావాలు కలిగిన ఇద్దరు యువతులు కాస్మోపాలిటన్ నగరం ముంబైలో పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నారనే కథ ఆధారంగా నిర్మించారు. ఈ కథను తెలుగు ప్రేక్షకుల అభిరుచులు, సెంటిమెంట్స్‌కు తగినట్టుగా మార్పులు చేర్పులు చేసి రూపొందించే ప్రయత్నంలో ఉన్నారు.

వెబ్ సిరీస్‌లో రేష్మా పసుపులేటి

వెబ్ సిరీస్‌లో రేష్మా పసుపులేటి

అడల్టింగ్ వెబ్ సిరీస్‌లో తమిళ బిగ్‌బాస్ సీజన్ 3 ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకొన్న తెలుగు అమ్మాయి రేష్మా పసుపులేటి మరో కీలక పాత్రలో కనిపిస్తారనేది తాజా సమాచారం. రేష్మా తెలుగు, తమిళ సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. లవ్, వంశం, పాగల్ నిలవు, భాగ్యలక్ష్మి సీరియల్స్ నటించారు.

సిరి హన్మంతు కెరీర్ ఇలా

సిరి హన్మంతు కెరీర్ ఇలా

ఇక సిరి హన్మంతు కెరీర్ విషయానికి వస్తే.. య్యూట్యూబ్‌లో మేడమ్ సార్.. మేడమ్ అంతే, గండరగోపాలం, రామ్‌లీలా సీరిస్‌లో నటించింది. ఎవరే నువ్వు మోహిన, అగ్నిసాక్షి, సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్స్‌లో ప్రేక్షకులను మెప్పించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X