Tamannaah Bhatia ఓటీటీలో లస్ట్ స్టోరీస్ 2 రేటింగ్ ఇదే.. తమన్నా మ్యాజిక్ పనిచేయలేదా?.. కారణం ఏమిటంటే?
స్టార్ హీరోయిన్లు తమన్నా భాటియా, మృణాల్ థాకూర్, కాజల్, నీనా గుప్తా, విజయ్ వర్మ తదితరులు నటించిన వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2. లస్ట్ స్టోరీస్ 1 సిరీస్‌కు మంచి స్పందన రావడంతో చాలా రోజుల నుంచి రెండో సీజన్ గురించి ప్రేక్షకుల ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తమన్నా భాటియా శృంగార విన్యాసాలతో కూడిన లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ ట్రెండింగ్ కావడంతో ఈ సిరీస్ మరోసారి క్రేజీగా మారింది. జూన్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వెబ్ సిరీస్ బడ్జెట్ ఎంత? నెట్‌ఫ్లిక్స్‌లో ఏ రేంజ్‌లో ఫెర్ఫార్మ్ చేసిందనే వివరాల్లోకి వెళితే..
లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. తమన్నా, కాజోల్, మృణాల్ థాకూర్, కొంకణా సేన్ లాంటి అగ్ర హీరోయిన్లు ఉండటంతో భారీగానే రెమ్యునరేషన్ చెల్లించారు. అలాగే బాలీవుడ్‌లో టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఉండటంతో బడ్జెట్ భారీగానే అయింది. ఈ వెబ్ సిరీస్‌ను సుమారు 80 కోట్ల రూపాయలతో నిర్మించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

లస్ట్ స్టోరీస్ 2 నాలుగు ఎపిసోడ్స్‌తో కూడిన అంథాలజీగా తెరకెక్కింది. ఆర్ బాల్కీ, సుజోష్ ఘోష్, అమిత్ రవీంద్రనాధ్ శర్మ, కొంకణాసేన్ దర్శకులుగా వ్యవహరించిన ఈ సిరీస్‌లో కాజల్ ఎపిసోడ్, తిలోత్తమ షోమే ఎపిసోడ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తమన్నా ఎపిసోడ్ ఫీల్‌గుడ్‌గా మారింది.
లస్ట్ స్టోరీస్ 2 సీజన్‌కు పెద్దగా స్పందన కనిపించలేదు. రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 3 మిలియన్ల వ్యూస్ మాత్రమే సాధించింది. 80 కోట్లకుపైగా బడ్జెట్‌ను చూసుకొంటే ఈ సిరీస్‌కు వచ్చిన వ్యూస్ తక్కువే అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రిలీజ్‌కు ముందు క్రియేట్ చేసిన బజ్‌ను ఈ సిరీస్ పాజిటివ్‌గా మలుచుకోలేదనే కామెంట్ వినిపించింది.
ఇక లస్ట్ స్టోరీస్ సీజన్ విషయానికి వస్తే.. తాజా రేటింగ్స్ విషయానికి వస్తే.. ఈ సిరీస్ 4వ స్థానంలో నిలిచింది. బిగ్‌బాస్ ఓటీటీ 2 అత్యధికంగా రేటింగ్ సాధించగా, ఆ తర్వాత నైట్ మేనేజర్ 2, టికు వెడ్స్ షేరు చిత్రం భారీ వ్యూస్ సాధించాయి. నైట్ మేనేజర్ 2 సిరీస్‌తో పోల్చుకొంటే లస్ట్ స్టోరీస్ తక్కువ వ్యూస్ సాధించింది.
అయితే లస్ట్ స్టోరీస్ 2 పెద్దగా ఆకట్టుకోలేకపోవడానికి ప్రధాన కారణం నెట్‌ఫ్లిక్స్. ఇండియాలో ఈ ఓటీటీ ఛానెల్‌కు సబ్‌స్క్రిప్షన్ బేస్ చాలా తక్కువ. డిస్నీ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియోతో పోల్చితే.. నెట్‌ఫ్లిక్స్‌కు తక్కువే. చాలా మంది లస్ట్ స్టోరీస్ 2 చూడలేకపోయడం వల్ల వ్యూస్ తగ్గాయనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వినిపించింది.


Click it and Unblock the Notifications











