ఏజెంట్ స్ట్రీమింగ్ లేట్ అందుకేనా? అంతా అయిపోయాక కటింగా!
చిన్న వయసులోనే 'సిసింద్రీ'గా అల్లరి చేసి.. 'అఖిల్' అనే మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు అక్కినేని వారసుడు అఖిల్. అయితే, హీరోగా డిజాస్టర్ ఎంట్రీని మూటగట్టుకున్న అతడు.. ఆ తర్వాత కూడా పలు పరాజయాలను చవి చూశాడు. ఈ పరిస్థితుల్లోనే గత ఏడాది 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'తో హిట్ ట్రాక్ ఎక్కాడు.
ఈ జోష్‌లోనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' అనే సినిమాను చేశాడు. ఈ మూవీ దాదాపు రూ. 80 కోట్లు బడ్జెట్‌తో రూపొందిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రం ఏప్రిల్ 28వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

అక్కినేని అఖిల్ - స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చిన 'ఏజెంట్' మూవీకి ఆరంభంలోనే నెగెటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్‌ను నిరాశాజనకంగా వచ్చాయి. అంతేకాదు, రెండో రోజు నుంచి దీనికి కలెక్షన్లు డౌన్ అవుతూ.. కేవలం వారం రోజుల్లోనే చాలా తక్కువ వసూళ్లతోనే రన్‌ను ముగించుకుంది.
ఫలితంగా భారీ నష్టాలను ఎదుర్కొని బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. దీంతో 'ఏజెంట్' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ను వీలైనంత త్వరగా ప్రారంభిస్తారని టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే దీన్ని మే 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటన కూడా వెలువడింది.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'ఏజెంట్' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు సోనీ లివ్ సంస్థ ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసింది. ఆ వెంటనే మే 19వ తేదీ నుంచే స్ట్రీమింగ్‌కు తీసుకు వస్తున్నట్లు అనౌన్స్ చేసింది. కానీ, ఇది మాత్రం ఇప్పటి వరకూ ఓటీటీలో అందుబాటులోకి రాలేదు.

ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమాకు సంబంధించిన ఎడిటింగ్ వర్క్ ఇప్పుడు జరుగుతుందట. సినిమాలో ల్యాగ్ అనిపించుకున్న సన్నివేశాలను కత్తిరించిన తర్వాత ఓటీటీలోకి తీసుకు వస్తారనే టాక్ వినిపిస్తోంది. దీనిపై చాలా మంది పెదవి విరుస్తున్నారు.
ఇదిలా ఉండగా.. అఖిల్ నటించిన 'ఏజెంట్'మూవీలో సాక్షి వైద్య హీరోయిన్‌గా, మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రను చేశారు. ఊర్వశీ ఓ స్పెషల్ సాంగ్ చేసింది. దీన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మించారు. వక్కంతం వంశీ స్టోరీ ఇచ్చిన దీనికి.. హిప్‌హాప్ తమీజా మ్యూజిక్ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











