Unstoppable 4: పూజా హెగ్డేపై కన్నేసిన యంగ్ డైరెక్టర్.. బాలకృష్ణ ముందే నాగవంశీ లీక్
బాక్సాఫీస్ బొనాంజా, నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాలిటీ గేమ్ షో అన్‌స్టాపబుల్ ఇండియాలోనే అత్యధిక రేటింగ్ ఉన్న టాక్ షోగా రికార్డు సృష్టించింది. అయితే గత 3 సీజన్లుగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. తాజాగా నాలుగో సీజన్ ఘనంగా ప్రారంభమైంది. అయితే ఈ సీజన్‌లో తొలి ఎపిసోడ్ భారీగా అధరణను సొంతం చేసుకొన్నది. అయితే 2వ ఎపిసోడ్‌లో బాలయ్య చేసిన రచ్చ విషయానికి వస్తే..
అన్‌స్టాపబుల్ సీజన్ 4 క్రేజీగా ఆరంభమైంది. గత సీజన్‌లో ప్రతిపక్ష హోదాలో గెస్టుగా వచ్చిన చంద్రబాబు నాయుడు ఈ సారి సీఎం హోదాలో మరోసారి ఈ వేదికను బాలకృష్ణతో పంచుకొన్నారు. చంద్రబాబుతో బాలయ్య జరిపిన చర్చ, ఆయన రాబట్టిన సమాధానాలు ఎన్నో ప్రశ్నలకు జవాబులు లభించాయి.

ఇక అన్‌స్టాపబుల్ సీజన్ 4 రెండో ఎపిసోడ్‌లో లక్కీ భాస్కర్ టీమ్ వేదికపై సందడి చేసింది. ఈ కార్యక్రమంలో దుల్కర్ సల్మాన్, దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ, హీరోయిన్ మీనాక్షి చౌదరీ పాల్గొన్నారు. ఈ షోలో ప్రోమో విషయానికి వస్తే.. దుల్కర్‌తో బాలయ్య చిలిపి ప్రశ్నలు వేస్తూ అతడితో ఆడుకొన్న విధానం ట్రైలర్‌లో ఆసక్తిని కలిగించింది. దుల్కర్ తండ్రికి వాట్సాప్ కాల్ చేసి బాలయ్య మాట్లాడటం మరింత హైలెట్‌గా కనిపించింది.
ఇక ఈ ఎపిసోడ్‌లో దర్శకుడు వెంకీ అట్లూరిని ఓ ప్రశ్న అడిగి అతడిని కంగారు పెట్టారు. మీరు ఎవరైనా యాక్టర్‌తో కలిసి పనిచేయాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారు ఎవరైనా ఉన్నారా? అని బాలయ్య ప్రశ్నిస్తే.. వెంకీ కంగారు పడ్డారు. ఆ పక్కనే ఉన్న నాగవంశీ మాత్రం.. ఆయన హీరోయిన్ పూజా హెగ్డేపై కన్నేశాడు. ఆమెతో కలిసి పని చేయాలని అనుకొంటున్నాడు అని అన్నాడు.

దాంతో వెంకీ అట్లూరి ఓ చూపు చూసి.. ఆమె హైట్ ఎక్కువ కదా.. నీవు ఆమె కంటే ఎత్తు తక్కువ కదా అని బాలయ్య ప్రశ్నిస్తే.. అదేం లేదు. మ్యానేజ్ చేస్తానంటూ అపి వెంకీ సమాధానం ఇచ్చాడు. ఇలా నలుగురితో బాలయ్య సరదాగా సాగిపోయింది. ఇప్పటికే ఈ ట్రైలర్ అంచనాలు పెంచింది.

అన్‌స్టాపబుల్ సీజన్ 4 ఎపిసోడ్ 2 అక్టోబర్ 31వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానున్నది. ఇదిలా ఉండగా, దుల్కర్, మీనాక్షి నటించిన లక్కీ భాస్కర్ మూవీ అక్టోబర్ 31వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ సినిమా ప్రీమియర్లు తెలుగు రాష్ట్రాల్లో 30వ తేదీన సాయంత్రం 7 గంటలకు మొదలవ్వనున్నాయి.


Click it and Unblock the Notifications











