OTT: ఓటిటి ప్రేక్షకులకు తంగలాన్ షాక్.. 100 కోట్ల విక్రమ్ మూవీ స్ట్రీమింగ్ ఆలస్యం?
ఈ ఏడాదిలో ఇండియన్ సినిమా దగ్గరకి మన సౌత్ ఇండియా సినిమా నుంచి కొంచెం తక్కువ సినిమాలే రిలీజ్ కి వెళ్లాయి అని చెప్పాలి. కాగా మన తెలుగు సినిమాలు ఆస్కార్ వరకు వెళ్లడంతో తమ సినిమా కూడా ఆస్కార్ వరకు వెళ్తుతుంది అని ఆ రేంజ్ సినిమా మేము చేస్తున్నాము అని తమిళ్ నుంచి ఓ సినిమా మేకర్స్ ఎప్పుడు నుంచో చెబుతూ వస్తున్నారు.
కాగా ఆ సినిమానే "తంగలాన్" కాగా ఈ చిత్రంలో వెర్సటైల్ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా నటించగా టాలెంటెడ్ దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించాడు. అయితే ఈ చిత్రాన్ని కేజీయఫ్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కిస్తున్నట్టుగా అప్పుడు టాక్ వచ్చింది. అయితే ఆల్రెడీ కన్నడ నుంచి వచ్చిన కేజీయఫ్ అనే సినిమా చూసేసాం కదా దీనిలో కొత్తదనం ఏముంటుంది అని చాలా మంది అనుకున్నారు.

కానీ నిజంగానే అదే బ్యాక్ డ్రాప్ తో దర్శకుడు పా రంజిత్ కొత్త సినిమా చేసి చూపించాడు. కాగా ఈ చిత్రంలో బోల్డ్ హీరోయిన్ మాళవిక మోహనన్ ఒక క్రేజీ రోల్ ని పోషించగా తన నటనతో మొట్ట మొదటిసారిగా అందరి చేసిన ఈ హాట్ బ్యూటీ మంచి మార్కులు ఈ చిత్రానికి కొట్టేసింది. మరి ఇలా వచ్చిన ఈ చిత్రం 100 కోట్లకి పైగా వసూళ్లు అందుకోగా ప్రస్తుతం ఓటిటి ఎంట్రీకి సిద్ధం అయ్యిపోయినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.
కాగా ఈ సినిమాని ప్రపంచ నెంబర్ 1 స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ వాళ్ళు సొంతం చేసుకోగా ఇందులో ఈ సినిమా ఒక్క హిందీ మినహా తెలుగు, తమిళం, కన్నడ మలయాళ భాషల్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యిందట. లేటెస్ట్ రూమర్స్ ప్రకారం ఈ చిత్రం పాన్ సౌత్ భాషల్లో ఈ సెప్టెంబర్ 20 నుంచే అందుబాటులోకి రానుంది అని తెలుస్తుంది. ఇక దీనిపై అఫీషియల్ అప్డేట్ కూడా త్వరలోనే రానుందట.

సో ఈ రా అండ్ రస్టిక్ గోల్డ్ యాక్షన్ డ్రామా ఇంకొన్ని రోజుల్లోనే ఓటిటి వీక్షకులని పలకరించనుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి కూడా మేకర్స్ పార్ట్ 2 ని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా హిందీ థియేట్రికల్ రిలీజ్ ఈ వారమే చేయడంతో నెట్ ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్ మాత్రం కొంచెం లేట్ గానే రానుంది. ఇక ఈ చిత్రానికి టాలెంటెడ్ సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ వారు నిర్మాణం వహించారు.
వీరే ఈ సినిమాకి ఆస్కార్ వచ్చే రేంజ్ ఉందని తప్పకుండా నామినేషన్స్ కి పంపిస్తామని చెప్తూ వచ్చారు. అయితే ఈ చిత్రానికి సినిమా అన్నట్టు కాదు కానీ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ నే అందుకుంది. మరి వారు కోరుకున్న ఆస్కార్ ఈ చిత్రానికి వస్తుందో లేదో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











