Darling on OTT Rights: ఫ్యాన్సీ రేటుకు డార్లింగ్ ఓటీటీ రైట్స్.. నభా నటేష్ మూవీకి ఎన్ని కోట్లంటే?
తెలుగు సినిమా దగ్గర ఉన్న పలు యంగ్ హీరోయిన్స్ లో కొందరు కెరీర్ స్టార్టింగ్ లోనే యూత్ లో పిచ్చ క్రేజ్ ని తెచ్చుకున్న వారు కూడా ఉంటారు. అలా క్రేజీ రోల్ తో యిట్టె యూత్ కనెక్ట్ అయ్యిన హీరోయిన్ నే నభా నటేష్. కాగా ఈ యంగ్ హీరోయిన్ టాలీవుడ్ ఆడియెన్స్ అండ్ తెలుగు యువతకి బాగా పరిచయం అయ్యిన ఆ సినిమానే "ఇస్మార్ట్ శంకర్".
దర్శకుడు పూరి జగన్నాథ్ తో చేసిన ఈ క్రేజీ సినిమా సెన్సేషనల్ హిట్ కాగా రామ్ సరసన ఈమె సీన్స్ అన్నీ థియేటర్స్ లో బ్లాస్ట్ అయ్యాయి. కానీ పార్ట్ 2 కి మాత్రం ఈమెకి చోటు దక్కలేదు. అలాగే ఈమెతో పాటుగా మరో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ కి కూడా పార్ట్ 2 లో చోటు దక్కలేదు. దీనితో ఇద్దరూ మరో సినిమాలు చేస్తుండగా అలా నభా నటేష్ కొంచెం సెలెక్టీవ్ గానే ఉంటుంది అని చెప్పాలి.

కేవలం గ్లామర్ మాత్రమే కాకుండా తనకంటూ మంచి ప్రాముఖ్యత ఉంటే తప్ప ఈ అమ్మడు సినిమాలు ఓకే చేయడం లేదు. అలా కెరీర్ లో కొంచెం గ్యాప్ తీసుకుంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో సోలో బ్రతుకే సో బెటర్ తర్వాత ఆ గ్యాప్ ని తీసుకోవడంలో మధ్యలో ఆమెకి చిన్న ప్రమాదం జరగడం వంటివి గ్యాప్ తీసుకొచ్చాయి.
అలా ఫైనల్ గా ఇప్పుడు ఈమె వస్తున్నా కొత్త సినిమానే 'డార్లింగ్'. యువ నటుడు ప్రియదర్శి సరసన ఈమె నటిస్తుండగా ఈ కామెడీ సినిమా ప్రధానంగా అయితే ఈమె పైనే నడుస్తుంది. కాగా ఈ సినిమాని నభా కూడా గట్టిగానే ప్రమోట్ చేస్తుండగా ఈ సినిమా అయితే ఇప్పుడు నాన్ థియేట్రికల్ డీల్ ని పూర్తి చేసేసుకున్నట్టుగా సినీ వర్గాల్లో అప్డేట్ బయటకి వచ్చింది.

కాగా ఈ సినిమా ఓటిటి సహా టీవీ హక్కులు స్టార్ అనుబంధ సంస్థలు కొనేశాయట. మరి ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే ఈ సినిమాకి బడ్జెట్ 6 కోట్లు అయితే ఈ 6 కోట్లు కూడా కేవలం ఈ హక్కులతోనే వచ్చేశాయట. వారు 6 కోట్లు చెల్లించి సినిమా కొనేశారట. సో ప్రస్తుతానికి వీరు లాభాల్లోనే ఉన్నారని చెప్పాలి. అయితే ఇంత చిన్న సినిమాకి ముందే ఈ తరహా బిజినెస్ జరగడానికి కంటెంట్ తో పాటుగా మరో కారణం కూడా ఉందని వినిపిస్తుంది.
ఈ చిత్రాన్ని సెన్సేషనల్ హిట్ 'హను మాన్' మేకర్స్ బ్యాక్ రోల్ చేయడంతో మరింత క్రేజ్ వచ్చింది. సో ఇది కూడా ప్రధాన కారణం అని చెప్పాలి. అలాగే ఈ జూలై 19న సినిమా థియేటర్స్ లో రాబోతుంది అక్కడా హిట్ అయితే మరిన్ని లాభాలు ఇస్మార్ట్ బ్యూటీకి వచ్చినట్టే అని చెప్పాలి. కాగా ఈ చిత్రాన్ని రామ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. మరి ఇప్పటికే ట్రైలర్ కి అందరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకు తగ్గట్టే సినిమా కూడా థియేటర్స్ లో పెర్ఫామ్ చేస్తుందో లేదో తెలియాలి అంటే ఈ జూలై 19 వరకు వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











