OTT ఓటీటీలో దుమ్మురేపుతున్న అనసూయ మూవీ.. ZEE5 లో 50 మిలియన్ల వ్యూస్‌తో!

ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్త జీ5 రూపొందించిన చిత్రం ప్రేమ విమానం. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసి ప్రేక్షకులకు అందించారు. భావోద్వేగాలతో సాగే ఈ సినిమాకు ఓటీటీలో మంచి స్పందన లభిస్తున్నది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ , జీ6 సంయుక్తంగా నిర్మించింది. అక్టోబర్ 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రికార్డు వ్యూస్ సాధిస్తున్నది. ఈ సినిమా చేస్తున్న ఓటీటీ హంగామా గురించిన వివరాల్లోకి వెళితే..

ప్రేమ విమానం సినిమా ఇద్దరు పిల్లల భావోద్వేగమైన కథ. పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించిన పిల్లలు ఎప్పటికైనా, ఎలాగైనా విమానం ఎక్కాలనే కోరిక కలుగుతుంది. అదే క్రమంలో గ్రామానికి చెందిన ప్రేమికులిద్దరూ పెద్దలను ఎదురించి విమానం ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రెండు జంటలు విమానం ఎక్కాయా? చివరకు వారి జీవితాలకు ఎలాంటి ముగింపు లభించిందనే ఎమోషనల్ కథను దర్శకుడు సంతోష్ కటా తెరకెక్కించారు.

Jabardasth Anchor Anasuya Bharadwajs Prema Vimanam hits 50 million streaming minutes in ZEE5.

ప్రేమ విమానం సినిమాకు అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. ఈ సినిమా 50 మిలియన్ల వ్యూస్ అంటే 5 కోట్ల స్ట్రీమింగ్ మినట్ వ్యూస్ వచ్చాయి. మేము రిలీజ్ చేసిన పులి మేక, వ్యవస్థ, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ సినిమాలకు మాదిరిగానే ప్రేమ విమానం సినిమాకు విశేషమైన ఆదరణ లభించింది అని జీ5 ఇండియా బిజినెస్ ఛీప్ మనీష్ కల్రా తెలిపారు.

ప్రేమ విమానం సినిమా స్పూర్తిదాయకమైన కథ. జీవిత లక్ష్యాలు, కలల సాకారం దిశగా స్పూర్తిని కలిగించిన చిత్రమిది. హృదయానికి హత్తుకొనే సినిమాలను అందించడానికి జీ5 ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటుంది. ప్రజల ఆలోచనలకు, అనుభూతిని పంచే సినిమాలు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం అని ఆయన అన్నారు.

Jabardasth Anchor Anasuya Bharadwajs Prema Vimanam hits 50 million streaming minutes in ZEE5.

నిర్మాత అభిషేక్ నామా కుమారులు దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ తమ పాత్రలతో ఆకట్టుకొన్నారు. అనూప్ రూబెన్ అందించిన సంగీతం ఆకట్టుకొన్నది. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫి స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X