OTTలోకి రష్మి యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలు... పెద్ద సినిమాలు అని ప్రేక్షకులు చూడరు. అది ఏ సినిమా.. ఏ భాష అనేది కూడా చూడరు. నచ్చిందంటే.. ఆ సినిమాను మన తెలుగు వాళ్లు ఆదరిస్తారు. ఇక కన్నడ సినిమాలు కేజీఎఫ్ తర్వాత గుర్తింపు తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఓ కన్నడ సినిమా తెలుగులోకి డబ్ అయి.. మంచి స్పందన తెచ్చుకుంది. కన్నడంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన హాస్టల్ హుడుగారు బేకగిదరే సినిమా తెలుగు వర్షన్ గా బాయ్స్ హాస్టల్ పేరుతో డబ్ అయింది. ఇక ఈ సినిమాలో ఓటీటీలోకి రాబోతుంది. ఆ వివరాల్లోకి వెళితే....

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సినిమా కేజీఎఫ్. ఇక ఈ సినిమాతో కన్నడ పరిశ్రమ రేంజ్ మారిపోయింది. అక్కడి సినిమాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇక కేజీఎఫ్ 2 తో కూడా అదే సీన్ రిపీట్. ఇక అక్కడి సినిమాలు మెళ్లిగా అన్ని భాషల్లో డబ్ అవుతూ వస్తున్నాయి. అందులో భాగంగానే... ఓ కన్నడ సినిమా తెలుగులో రిలీజ్ అయి సూపర్ హిట్టుగా నిలచిింది.

Jabardasth Anchor Rashmi Gautam Boys Hostel Movie Going To Streaming on Etv Win OTT From Nov 10th Full Details Here

కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన చిత్రం 'హాస్టల్‌ హుడుగారు బేకగిద్దరే'. తెలుగులో 'బాయ్స్‌ హాస్టల్‌' పేరుతో డబ్ అయి... ఇక్కడి ప్రేక్షకులను సైతం అలరించింది. ఇక ఈ సినిమాకు నితిన్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో ప్రజ్వల్‌, మంజునాథ్‌ నాయక, రాకేష్‌ రాజ్‌కుమార్‌, శ్రీవత్స, తేజస్‌ జయన్న ప్రధాన పాత్రల్లో నటించారు. రిషబ్‌ శెట్టి, రష్మీ గౌతమ్‌, తరుణ్‌భాస్కర్‌ అతిథి పాత్రలు పోషించారు.

ఇక ఈ మూవీ ఆగస్టు 26వ తేదీన రిలీజ్ అయింది. ఇక బాక్సాఫీస్ ఈ సినిమా కన్నడ ప్రేక్షకులనే కాదు.. ఇక్కడి ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. ఇప్పటికే కన్నడ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇక తెలుగు వర్షన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనుకున్న నేపథ్యంలో... సినీ ప్రేక్షకులకు ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ గుడ్ న్యూస్ చెప్పింది.

Jabardasth Anchor Rashmi Gautam Boys Hostel Movie Going To Streaming on Etv Win OTT From Nov 10th Full Details Here

బాయ్స్ హాస్టల్ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ భారీ ధరకు విక్రయిందని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఈటీవీ విన్ ప్రకటించింది. నవంబరు 10వ తేదీ నుంచి ఈ చిత్రం ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక థియేటర్లో ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ను మీరు మిస్ అయితే కనుక ఇంట్లోనే ఎంచక్కా చూసేయండి.

Jabardasth Anchor Rashmi Gautam Boys Hostel Movie Going To Streaming on Etv Win OTT From Nov 10th Full Details Here

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. హాస్టల్‌ క్యాంపస్‌ లో ఓ రాత్రి జరిగే కథగా దీన్ని తెరకెక్కించారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. ఇక ఈ సినిమాలో తరుణ్ భాస్కర్, రష్మి గౌతమ్ అతిథి పాత్రల్లో నటించారు. వీరి పాత్రల కోసం మళ్లీ షూట్ చేసి మరీ రిలీజ్ చేశారు మేకర్స్. థియేటర్లో మిస్ అయితే కనుగ ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X