twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jabardasth Faima బిగ్‌బాస్ గేమ్ చేంజర్.. సింగర్‌ రేవంత్‌ను భలేగా దెబ్బ కొట్టిందిగా?

    |

    బిగ్‌బాస్ తెలుగు 6 రియాలిటీ షో కెప్టెన్సీ టాస్క్ రంజుగా సాగింది. సిసింద్రి పేరుతో సాగిన కెప్టెన్సీ టాస్క్‌ వినోదంతోపాటు, కంటెస్టెంట్ల వ్యూహాలు స్పష్టంగా కనిపించాయి. ఈ టాస్క్‌లో జబర్దస్త్ ఫైమా, గీతూ రాయల్ ఆట తీరు ఆకట్టుకొన్నది. ఈ టాస్క్‌లో ఫైమా, గీతూ ఎత్తుగడలు ఆట తీరును పూర్తిగా మార్చేసింది. కెప్టెన్సీ టాస్క్‌ సిసింద్రీ ఎలా సాగిందంటే?

     సిసింద్రీ కెప్టెన్సీ టాస్క్

    సిసింద్రీ కెప్టెన్సీ టాస్క్

    ఇంటిలో నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత సభ్యులకు కెప్టెన్సీ టాస్క్‌ను బిగ్‌బాస్ తెరపైకి తెచ్చారు. సిసింద్రీ టాస్క్‌లో ప్రతీ ఇంటి సభ్యులకు ఒక బొమ్మను ఇచ్చి.. దానిని మీ బిడ్డగా చూసుకొంటూ సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని చెప్పారు. ఒకవేళ బొమ్మను పక్కన పడేసినా.. తమ వద్ద ఉంచుకోకపోయినా దానిని ఇతర సభ్యులు లాస్ట్ అండ్ ఫౌండ్ ఏరియాలో వేస్తే సదరు కంటెస్టెంట్ కెప్టెన్సీ టాస్క్‌కు అనర్హత సాధిస్తారు అని బిగ్‌బాస్ ఆదేశాలు ఇచ్చారు.

    కెప్టెన్సీ టాస్క్ రూల్స్ ఇలా..

    కెప్టెన్సీ టాస్క్ రూల్స్ ఇలా..

    అయితే సిసింద్రీ టాస్క్ జరుగుతున్న సమయంలో సమయానుకూలంగా బజర్ మోగినప్పుడు.. లాన్‌లో ఉన్న తొట్టెలో బొమ్మను పెట్టాలి. అలా ఎవరైతే ఐదుగురు ముందు పెడుతారో.. వారు కెప్టెన్సీ టాస్క్ పోటీదారులుగా ఎంపికవుతారు. ఇలా జరిగే టాస్క్‌లో ఎవరైతే ఎక్కువ సార్లు గెలుస్తారో వారు కెప్టెన్సీ టాస్క్‌కు పోటీదారులు అవుతారు అని బగ్‌బాస్ చెప్పారు.

    కెప్టెన్సీ టాస్క్ పోటీదారులుగా

    కెప్టెన్సీ టాస్క్ పోటీదారులుగా

    అయితే తమకు ఇచ్చిన బొమ్మలను జాగ్రత్తగా చరూసుకొన్నారు. తొలిసారి బజర్ మోగగానే.. వేగంగా పరుగెత్తి రేవంత్, చలాకీ చంటి, అరోహిరావు తదితరులు అర్హత సాధించారు. అనంతరం జరిగిన షేప్స్ అండ్ షాక్స్ గేమ్ ఆడారు. బస్తాలో కాళ్లు పెట్టి.. ఒకవైపు ఉన్న షేప్స్‌ను మరోవైపు ఉన్న బోర్డులో పెట్టాలని గేమ్ రూల్స్ చెప్పారు.

    రేవంత్‌కు షాకిచ్చిన ఫైమా

    రేవంత్‌కు షాకిచ్చిన ఫైమా

    గేమ్ స్టార్ట్ కాగానే.. రేవంత్ చాలా వేగంగా వెళ్లి షేప్స్ బిల్లలను తన ఎదురుగా ఉన్న బోర్డుపై పెట్టారు. అయితే రేవంత్‌కు కావాల్సిన ఒక బొమ్మను ఫేమస్ ఫైమా తన బోర్డుపై పెట్టింది. ఆ బొమ్మను ఫైమా ఇస్తే గానీ.. రేవంత్ విజయం సాధించే పరిస్థితి ఉండదు.

    అయితే ఆ బొమ్మను ఇవ్వమని ఫైమాను రేవంత్ రిక్వెస్ట్ చేశారు. కానీ ఫైమా అసలు పట్టించుకోలేదు. నా గేమ్ అది అంటూ కామెంట్ చేసింది. ఈ లోగా చలాకీ చంటీ వెళ్లి తన గేమ్‌ను పూర్తి చేశాడు. అలా తొలి కెప్టెన్సీ టాస్క్ పోటీదారుడిగా చంటి అర్హత సాధించాడు.

     ఓడించాలని చూస్తే వాళ్లకే ఓటమి అంటూ

    ఓడించాలని చూస్తే వాళ్లకే ఓటమి అంటూ

    కెప్టెన్సీ టాస్క్ పోటీదారుల గేమ్‌లో చలాకీ చంటి విజయం సాధించిన తర్వాత రేవంత్ నిరుత్సాహానికి గురయ్యాడు. ఫైమా హెల్ప్ చేస్తే తాను గెలిచేవాడిని. అయినా నన్ను ఓడించాలని చూస్తే వారు కూడా ఓడిపోతారు కదా అని రేవంత్ అన్నాడు. ఓ దశలో కంటతడి పెట్టుకొంటూ కనిపించాడు. తాను ఎంత కష్టపడినా.. విజయం దక్కడం లేదని బాధపడ్డాడు.

     ఫైమా గేమ్ ఛేంజర్ అంటూ ..

    ఫైమా గేమ్ ఛేంజర్ అంటూ ..

    అయితే రేవంత్‌ వేగంగా పూర్తి చేయడానికి అవకాశం ఉన్నా.. ఫైమా అడ్డుకోవడం గేమ్‌లో ఇంట్రెస్ట్‌గా మారింది. కెప్టెన్ కావడానికి రేవంత్‌కు ఉన్న అవకాశాలను ఫైమ్ అడ్డుకొన్నది. ఫైమా వ్యవహరించిన తీరుతో రేవంత్‌కు బదులు చంటి కెప్టెన్సీ కంటెండర్‌గా మారాడు. దీంతో ఫైమ్ కెప్టెన్సీ టాస్క్‌లో గేమ్ ఛేంజర్‌గా మారిందని గీతూ రాయల్, ఇతర సభ్యులు కామెంట్ చేశారు.

    English summary
    Captaincy task sisindri in Bigg Boss Telugu 6 goes very interestingly. Jabardasth Faima changes game by spoiling the Captancy Chances of Singer Revanth in Bigg Boss Telugu 6
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X