అప్పుడే ఓటీటీలోకి రాజు యాదవ్ మూవీ.. గెటప్ శ్రీను సినిమా ఎలా చూడాలంటే!
ఈ మధ్య కాలంలో బుల్లితెరపై ఎంతో మంది తమదైన రీతిలో ప్రభావాన్ని చూపించి సత్తా చాటుతోన్నారు. అలా టెలివిజన్ రంగంలో విలక్షణమైన నటనతో సెన్సేషన్ అయ్యాడు కమెడియన్ గెటప్ శ్రీను. జబర్ధస్త్ షో ద్వారా సెలెబ్రిటీ అయిపోయన అతడు.. సినిమాల్లోనూ సత్తా చాటుతోన్నాడు. ఈ క్రమంలోనే గెటప్ శ్రీను లీడ్ రోల్‌లో 'రాజు యాదవ్' అనే సినిమాలో నటించాడు.
గెటప్ శ్రీను హీరోగా మారి చేసిన సినిమానే 'రాజు యాదవ్'. గతంలో చాలా చిత్రాలకు అసిస్టెంట్‌గా వర్క్ చేసిన కృష్ణమాచారి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డిఫరెంట్ కాన్సెప్టుతో రూపొందిన ఈ సినిమా ఆరంభంలోనే అందరి దృష్టిలో పడింది. అందుకు అనుగుణంగానే మంచి అంచనాలను ఏర్పరచుకుంది. ఇలా ఈ మూవీ మే 17వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'రాజు యాదవ్' మూవీకి ఆరంభంలో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, మొదటి వీకెండ్‌లో ఈ చిత్రం సత్తా చాటింది. అయితే, ఆ తర్వాత మాత్రం ఈ సినిమా క్రమంగా డౌన్ అవుతూ వచ్చింది. తద్వారా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోకుండానే రన్‌ను ముగించింది. దీంతో గెటప్ శ్రీనుకు అతడి అభిమానులకు నిరాశనే మిగిల్చింది.
'రాజు యాదవ్' సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉండడంతో.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం మంచి పోటీ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థలు కొనుగోలు చేసింది. ఇందుకోసం ఇది భారీ మొత్తాన్నే నిర్మాతలకు అప్పజెప్పిందని తెలుస్తోంది. ఇక, తాజాగా 'రాజు యాదవ్' మూవీ స్ట్రీమింగ్ వివరాలు లీక్ అయ్యాయి.
గెటప్ శ్రీను నటించిన 'రాజు యాదవ్' సినిమా ఆశించిన స్థాయిలో ప్రదర్శన కాకపోవడంతో దీన్ని నెల రోజుల లోపే స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని జూన్ 22వ తేదీ నుంచి అమెజాన్ సంస్థ అందుబాటులోకి తీసుకు వస్తుందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీనిపై మరికొద్ది రోజుల్లో ప్రకటన రాబోతుందనే టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. 'రాజు యాదవ్' ఈ చిత్రాన్ని శ్రీ వరుణ్మయి క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రశాంత్ రెడ్డి నిర్మించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ మూవీకి సంగీతాన్ని అందించారు. ఇందులో అంకిత కరత్ హీరోయిన్‌గా చేయగా... ఆనంద చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్, సన్నీ, సంతోష్ తదితరులు కీలక పాత్రలను చేశారు.


Click it and Unblock the Notifications











