ఓటీటీలో బేబి రేంజ్ లవ్ మూవీ.. బుల్లితెర స్టార్ సినిమాను ఎక్కడ చూడాలంటే!
సాధారణంగా సినిమాల్లో నటించే వాళ్లకు మాత్రమే భారీ స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంటుంది. కానీ, ఈ మధ్య కాలంలో ఎంతో మంది బుల్లితెర నటులు కూడా హై రేంజ్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో విలక్షణ నటనతో టెలివిజన్ రంగంలో స్టార్‌గా మారిపోయిన గెటప్ శ్రీను ఒకడు. అతడు హీరోగా మారి నటించిన లేటెస్ట్ మూవీనే 'రాజు యాదవ్'.
గెటప్ శ్రీను హీరోగా నటించిన ఎమోషనల్ లవ్ సినిమానే 'రాజు యాదవ్'. గతంలో చాలా చిత్రాలకు అసిస్టెంట్‌గా వర్క్ చేసిన కృష్ణమాచారి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డిఫరెంట్ కాన్సెప్టుతో రూపొందిన ఈ సినిమా ఆరంభంలోనే అందరి దృష్టిలో పడింది. అందుకు అనుగుణంగానే మంచి అంచనాలను ఏర్పరచుకుంది. ఇలా ఈ మూవీ మే 17వ తేదీన ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది.

కామెడీ అండ్ ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందిన 'రాజు యాదవ్' మూవీకి ఆరంభంలో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మొదటి వీకెండ్‌లో ఈ చిత్రం రాణించింది. అయితే, ఆ తర్వాత మాత్రం ఈ సినిమా క్రమంగా డౌన్ అయిపోయింది. తద్వారా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోకుండానే ఆగిపోయింది. దీంతో గెటప్ శ్రీనుకు హీరోగా విజయం మాత్రం లభించలేదు.
'రాజు యాదవ్' సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడడంతో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం మంచి పోటీ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ రైట్స్‌ను ఆహా సంస్థ కొనుగోలు చేసింది. ఇందుకోసం ఇది భారీ మొత్తాన్నే నిర్మాతలకు అప్పజెప్పిందని తెలుస్తోంది. ఇక, గత బుధవారం నుంచే 'రాజు యాదవ్' మూవీని సదరు సంస్థ తీసుకు వచ్చేసింది.
బుల్లితెర ఆల్‌రౌండర్ గెటప్ శ్రీను నటించిన 'రాజు యాదవ్' సినిమాను ఆహా సంస్థ బుధవారం నుంచే స్ట్రీమింగ్ చేస్తోంది. దీంతో థియేటర్లలో మిస్ అయిన వాళ్లంతా దీని కోసం ఎగబడుతున్నారు. ఫలితంగా అందులో ఈ చిత్రానికి అదిరిపోయే స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం ఆహాలో రికార్డు వ్యూస్‌ను సొంతం చేసుకుంటోందని అంటున్నారు.
ఇదిలా ఉండగా.. లవ్ అండ్ ఎమోషనల్ కంటెంట్‌తో వచ్చిన 'రాజు యాదవ్' చిత్రాన్ని శ్రీ వరుణ్మయి క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రశాంత్ రెడ్డి నిర్మించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ మూవీకి సంగీతాన్ని అందించారు. ఇందులో అంకిత కరత్ హీరోయిన్‌గా చేయగా... ఆనంద చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్, సన్నీ, సంతోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











